క్రీడల్లో నైపుణ్యం సాధించాలి
ABN , First Publish Date - 2021-12-31T05:45:39+05:30 IST
విద్యతోపాటు క్రీడలల్లో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్ససత్యనారాయణ క్రీడాకారులకు సూచించారు.

- జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ
- టోర్నీ విజేతలకు బహుమతుల పంపిణీ
పుట్టపర్తి, డిసెంబరు 30: విద్యతోపాటు క్రీడలల్లో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్ససత్యనారాయణ క్రీడాకారులకు సూచించారు. సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆఽధ్వర్యంలో ఎమ్మెల్యేదుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నిర్వహిస్తున్న వైఎస్ ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ పోటీలు గురువారం జరిగాయి. అగ్రహారం, గోకులం జట్లు తలపడగా అగ్రహరం జట్టు విజేతగా నిలిచింది. విన్నర్స్‌కు రూ.2.50 లక్షల చెక్కు, ట్రోఫీ ని, రన్నర్స్ రూ.1.25లక్షల చెక్కుతో పాటు ట్రోఫీని మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అం దజేసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడు తూ...గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట మాట్లాడుతూ.... నియో జకవర్గంలో స్టేడియం నిర్మించేందుకు మంత్రి సహ కరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గోరంట్లమాదవ్, తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు డాక్టర్ సిద్దారెడ్డి, తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, జేసీ సిరి, అహుడా చైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, అనంతపురం నగర పాలకసంస్థ కమిషనర్ మూర్తి, హౌసింగ్ పీడీ కేశవనాయుడు, మున్సిపల్ చైర్మన్‌తుంగా ఓబుళపతి, కమిషనర్ శివరామిరెడ్డి, పుడాచైర్మన్ లక్ష్మీనరసమ్మ, ఎంపీపీ రమణారెడ్డి, నిట్కో డైరెక్టర్ బీడిపల్లి మాధవరెడ్డి, ప్రజాప్ర తినిధులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.