మహానగరాల సరసన అనంత

ABN , First Publish Date - 2021-10-25T06:45:53+05:30 IST

అభివృద్ధిలో విస్తురిస్తున్న అ నంతపురం మహానగరాల సరసన చేరుతోంద ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నా రు.

మహానగరాల సరసన అనంత

‘సువర్ణధామ్‌’ బ్రోచర్‌ ఆవిష్కరణలో 

ఎంపీ గోరంట్ల

అనంతపురం అర్బన, అక్టోబరు 24: అభివృద్ధిలో విస్తురిస్తున్న అ నంతపురం మహానగరాల సరసన చేరుతోంద ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నా రు. ఆదివారం సువర్ణధామ్‌ 2 బీహెచకే హౌస్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కళ్యాణదుర్గం రోడ్డులోని కురుగంట సమీపంలో సువర్ణధామ్‌ 2బీహెచకే హౌస్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ, అహుడా చైర్మర్‌ మహాలక్ష్మీ శ్రీనివాస్‌, తోపుదుర్తి ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ సువర్ణధామ్‌ 2 బీహెచకే హౌస్‌ ఆధ్వర్యంలో అన్నిరకాల సౌకర్యాలతో సరికొత్త డిజైన్లతో గృహాలను నిర్మిస్తుండటం అభినందనీయమన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనుభవం కల్గిన భవనాశి గ్రూప్స్‌, సత్యనారాయణ సత్యా గ్రూప్స్‌ హైదరాబాద్‌, బెంగళూరు తదితర మహానగరాలకు ధీటుగా సువర్ణధామ్‌ 2 బీహెచకే హౌస్‌ను అనంత ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేస్తుండటం హర్షణీయమన్నారు. ఇలాంటి రూపకల్పనలతో భవిష్యత్తులో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఇంటీరియర్‌ డిజైనర్‌ శరతబాబు, నాగరాజు, చిన్న, కాంట్రాక్టర్లు, మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:45:53+05:30 IST