మొహర్రం పీర్లచావిళ్లు, ఊరేగింపులు రద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-08-10T06:21:15+05:30 IST

కరోనా 3వ దశను దృష్టిలో ఉంచుకుని... మంగళవారం నుంచి ప్రారం భం కానున్న మొహరం నెలలో ఏర్పాటు చేసే పీర్ల చావిళ్లు, ఊరేగింపులను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, మై నార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి మహ్మద్‌రఫీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మొహర్రం పీర్లచావిళ్లు, ఊరేగింపులు రద్దు : కలెక్టర్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు9 : కరోనా 3వ దశను దృష్టిలో ఉంచుకుని... మంగళవారం నుంచి ప్రారం భం కానున్న మొహరం నెలలో ఏర్పాటు చేసే పీర్ల చావిళ్లు, ఊరేగింపులను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, మై నార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి మహ్మద్‌రఫీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో ముతవల్లీలు, ము జావర్లు, మేనేజింగ్‌ కమిటీలకే అకాశం కల్పిస్తున్నట్లు తెలి పారు. జిల్లాలో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా మొ హర్రం వేడుకలను గత ఏడాది మాదిరిగానే జరుపుకోవాలని కోరారు. ఫాతేహా సమయంలో 10మంది సభ్యులు, మజ్లిస్‌ విషయంలో 40 మంది సభ్యులు మించకుండా తగిన జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పా టిస్తూ, తరచూ శానిటైజరు వినియోగిస్తూ జరుపుకోవాల న్నారు. సాధారణ ప్రజలు ఫాతేహా, మజ్లిస్‌లను ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. మంగళవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో గుంపులుగా ఉండరాదని సూచించారు. 


Updated Date - 2021-08-10T06:21:15+05:30 IST