కరోనా వ్యాప్తికి మోదీయే కారణం

ABN , First Publish Date - 2021-05-08T05:43:55+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు

కరోనా వ్యాప్తికి మోదీయే కారణం
ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఐ నాయకులు


 ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిన సీపీఐ నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 7: దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాని నరేంద్ర మోదీయే కారణమని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు. శుక్రవారం కొవిడ్‌ వ్యాప్తి నివారణ, వ్యాక్సిన్‌ సరఫరాలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌ ఆవరణలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భం గా జగదీష్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరాలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. దేశంలో కరోనా కేసులు పెరిగేందుకు ప్రధాని ముందస్తు చర్యలు తీసుకోకపోగా కుంభమేళా, బెంగాల్‌ ఎన్నికల ప్రచారం వంటి స్వార్థ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. ఆక్సిజన్‌ నిల్వలు ఉంచకుండా ప్రజల మరణాలకు కారణమయ్యారన్నారు. దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని గాలకొదిలేసి, కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దే శవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ నిల్వలు పెంచలేకపోయారన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రా ష్ట్రంలో అనాలోచిత నిర్ణయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలతో సీఎం జగన్‌ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యపు అరెస్టులతో ప్రజలను భయోందోళనలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, క నీస వసతులను పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే కరోనా మరణాలు అధికమయ్యాయన్నారు. కరోనా కేసులు, మరణాలను దాచి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాష్ట్రం, జిల్లాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి, తరచూ కరోనా నివారణకు సూచనలు స్వీకరించకుండా, అహంకారపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంపిళ్లు సేకరించిన వారానికి పరీక్ష ఫలితాలను వెల్లడిస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతోందన్నారు. అధికార పక్షంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేందుకు కదిరిలో ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ చేసిన నినాదాలే నిదర్శనమన్నారు. కరోనా నివారణ చర్య లు, ఆసుపత్రుల్లో పడకలు పెంచాలని, ఆక్సిజన్‌ నిల్వలు మరింత మెరుగుపరచాలని, సిబ్బందిని అదనంగా నియమించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్‌, పి నారాయణస్వామి, నేతలు శ్రీరాములు, లింగమయ్య, అల్లీపీరా, రమణయ్య, రమేష్‌, పార్వతమ్మ, రాజే్‌షగౌడ్‌, మనోహర్‌, సంతో్‌షకుమార్‌, ఆనంద్‌, కృష్ణుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T05:43:55+05:30 IST