వెక్కిరిస్తున్న పేదల గృహ నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-07-12T06:13:31+05:30 IST

మండలంలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మా ణ పథకం వెక్కిరిస్తోంది. కొండ గుట్టల్లో అనువుగాని చోట లబ్ధిదారుల కు ప్లాట్లు కేటాయించడం ఒక ఎత్తయితే, మరికొన్ని కాలనీల్లో నిర్మాణాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.

వెక్కిరిస్తున్న పేదల గృహ నిర్మాణాలు
ట్యాంకర్ల ద్వారా పునాదుల తవ్వకానికి నీటిని వదులుతున్న లబ్ధిదారులు

అనువుగాని చోట జగనన్న కాలనీలు

ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులు

పలు లేఅవుట్లలో సౌకర్యాలు లేక అవస్థలు

ట్యాంకర్ల నీటితో పునాదుల నిర్మాణం


కూడేరు, జూలై 11 : మండలంలోని జగనన్న కాలనీల్లో గృహ నిర్మా ణ పథకం వెక్కిరిస్తోంది. కొండ గుట్టల్లో అనువుగాని చోట లబ్ధిదారుల కు ప్లాట్లు కేటాయించడం ఒక ఎత్తయితే, మరికొన్ని కాలనీల్లో నిర్మాణాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. వెరసి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాలేకపోతున్నారు. ని రుపేదల సొంతింటికల నెరవేర్చాలన్న సంకల్పంతో ప్రభుత్వమే ఇళ్లు ని ర్మించి ఇస్తామని గొప్పలు చెప్పింది. చివరికి చేతులెత్తేయడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య ప్రజలు తామే ఇళ్లు నిర్మించుకోవాలంటే ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. జగనన్న కాలనీ ల్లో గృహ నిర్మాణం పథకం వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ... కాలనీల్లో అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణానికి అ వసరమైన నీరు అందుబాటులో లేవు. దీంతో ఒక ట్యాంక్‌ నీరు వెయ్యి రూపాయల ఖర్చుతో లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పునాదుల నిర్మాణానికి అవసరమైన రాళ్ల ధరలు భారీగా పెరిగిపోయా యి. గతంలో ట్రాక్టర్‌ రాళ్లు రూ.4 వేలు ఉండగా... నేడు ఏకంగా రూ. 7500 ధర పలుకుతోంది. దీంతో పునాది నిర్మాణానికి రూ.60 వేల నుం చి 70 వేల వరకూ ఖర్చు వస్తోందని లబ్ధిదారులు చెబుతున్నారు.  ప్ర భుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షలతో పాటు ఉపాధిహామీ పథ కం కింద మరో రూ.30 వేలు అందిస్తుందని హౌసింగ్‌ ఏఈ జయచం ద్ర చెబుతున్నారు. అయితే ఈసొమ్ము ఇళ్ల నిర్మాణాలకు ఏ మూలకూ సరిపోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.


685 మంది లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు

మండల వ్యాప్తంగా 28 గ్రామాలుండగా 17 గ్రామాల్లోనే జగనన్న కాలనీలకు లేఅవుట్లు ఉన్నాయి. మరో నాలుగు గ్రామాల్లో లేఅవుట్లు వే యడంతో కొందరు రైతులు కోర్టుకు వెళ్లగా నిలిపివేశారు. ప్రస్తుతం 17 లేఅవుట్లలో 685 మందికి ప్లాట్లు కేటాయించారు. ఇందులో కూడేరు, క రుట్లపల్లి, కొర్రకోడు, నాగిరెడ్డిపల్లి, ముద్దలాపురం తదితర గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకు న్నాక బిల్లులు చెల్లిస్తామంటూ మెలికపెట్టడంతో లబ్ధిదారులు ఖంగుతిం టున్నారు. ఇళ్లు నిర్మించుకోకపోతే ప్లాట్‌ మరొకరికి ఇస్తామని చెప్పడం తో గత్యంతరం లేక అప్పులు చేసి కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మా ణ పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించే సొమ్ము ఇంటి నిర్మాణానికి ఏమూలకూ సరిపోదని, మరో రెండు లక్షలకుపైగా అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని కొందరు లబ్ధిదారులు ఆ వేదన చెందుతున్నారు. అంతరగంగ, కల్లగల్ల గ్రామాల్లో అనువుగాని చోట స్థలాలు ఇవ్వడంతో లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మా ణం చేసుకుంటామని చెప్పడంతో అధికారులు మిన్నకుండిపోయారు.


నత్తనడకన ఇంటి నిర్మాణ పనులు 

జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరగాలని ప్రభు త్వం అధికారులపై ఒత్తిడి తెస్తున్నా లబ్ధిదారులు మాత్రం పెడచెవిన పె డుతున్నారు. చోళసముద్రం, కడదరకుంట, జల్లిపల్లి, అరవకూరు గ్రామా ల్లో ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు లబ్ధిదారులను పదేపదే కోరుతున్నా... నీటి సౌకర్యాలు లేకపోవడంతో పునాదుల నిర్మాణానికి మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వం ఓ పక్క ఇంటి ని ర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి పెరుగుతుండటంతో మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారు ల్లో అవగాహన కల్పిస్తున్నారు. అయినా ఫలితం ఆశించిన మేరకు రావ డం లేదని అధికారులు లోలోపలే మదనపడుతున్నారు.


 విద్యుత సరఫరాలో అలసత్వం

మండలంలోని పలు గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో బోర్లు వేశారు. అయితే విద్యుత సరఫరా లేకపోవడంతో ప్రస్తుతం బోర్లలో మోటార్లు బిగించి వదిలేశారు. విద్యుత సరఫరా వచ్చే వరకూ మోటార్లు ఆడే పరిస్థితి లేదు. దీంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి అవసరమైన నీటిని ట్యాంకర్లతో తరలిస్తున్నారు. త్వరితగతిన విద్యుత సరఫరా చేస్తే కనీసం నీటి భారమైనా తగ్గుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు.


వంద శాతం ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం 

జయచంద్ర, హౌసింగ్‌ ఏఈ 

ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్లు 100 శాతం పూర్తి చేస్తాం. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో పునాదుల తవ్వకాలతో పాటు  నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా అందించడంతో పాటు తక్కువ ధరకే సిమెంట్‌ అందిస్తున్నాం. త్వరలోనే లబ్ధిదారులందరికి సిమెంట్‌ సరఫరా చేస్తాం. 


Updated Date - 2021-07-12T06:13:31+05:30 IST