సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-20T06:24:41+05:30 IST

మండల పరిధిలోని సోమయాజులపల్లి నూతన సచి వాలయాన్ని గురువారం ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి ప్రారంభించారు.

సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి

గాండ్లపెంట, ఆగస్టు 19: మండల పరిధిలోని సోమయాజులపల్లి నూతన సచి వాలయాన్ని గురువారం ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమయాజులపల్లిలో రూ.40 లక్షలు వ్యయం చేసి నూతన సచివాలయ భవనం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలు వివరించారు. పంచాయతీ ప్రజలు, రైతులు సచివాలయం సేవ లను వినియోగించుకోవాలన్నారు. సచివాలయ అధికారులు ప్రజలకు నిత్యం అందు బాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. గాండ్లపెంట, తూపల్లి, వంకపల్లి, పోరెడ్డివారిపల్లి మిట్ట వరకు రూ. 1.73 కోట్లతో నిర్మించిన తారురోడ్డు శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గాండ్లపెంటలో కొలువైన పీర్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటరమణ, ఇనచార్జ్‌ ఎంపీడీఓ సునీత, కదిరి ఎంపీ డీఓ రమేష్‌బాబు, వైసీపీ నాయకులు వాల్మీకి పవనకుమార్‌రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు లీలారాణి, సర్పంచులు అనసూయమ్మ, గజ్జల లక్ష్మీదేవమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T06:24:41+05:30 IST