భువనేశ్వరిపై వైసీపీ వ్యాఖ్యలు బాధాకరం: Payyavula
ABN , First Publish Date - 2021-11-26T18:28:06+05:30 IST
చంద్రబాబును ఎదుర్కోలేక కుటుంబ సభ్యులపై దిగజారి మాట్లాడారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

అనంతపురం: చంద్రబాబును ఎదుర్కోలేక కుటుంబ సభ్యులపై దిగజారి మాట్లాడారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భువనేశ్వరిపై వైసీపీ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. విమర్శలు చేసిన మంత్రులకు భద్రత కల్పించారని... మహిళలపై మాత్రం పోలీసులు దాడులు చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.