ఎమ్మెల్యే ఆగ్రహం?
ABN , First Publish Date - 2021-08-25T06:31:10+05:30 IST
నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డికి చెందిన అసైన్డభూమిని ఆనలైనలో ఎక్కించారన్న దానిపై రెండురోజులక్రితం తహసీల్దార్ నాగభూషణంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోనలో ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది.

సెలవులో వెళ్లిన డిప్యూటీ తహసీల్దార్
టీడీపీ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డి అసైన్డభూమిని ఆనలైన చేయడమేనా?
బలిపశువులుగా మారిన డీటీ, కంప్యూటర్ ఆపరేటర్
తాడిపత్రి, ఆగస్టు 24: నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డికి చెందిన అసైన్డభూమిని ఆనలైనలో ఎక్కించారన్న దానిపై రెండురోజులక్రితం తహసీల్దార్ నాగభూషణంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫోనలో ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది. బాధ్యులైన వారిని సెలవుపై పంపాలని సూచించారని సమాచారం. ఎమ్మెల్యే సూచనల ప్రకారం బాధ్యులైన డిప్యూటీ త హసీల్దార్ శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్‌లను సెలవులో వెళ్లాలని త హసీల్దార్ ఆదేశించారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పశువుల ఆసుపత్రి వెనుకభాగంలో టీడీపీ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డికి చెందిన 68 సెంట్ల అసైన్డభూమికి 2018లో ఎనఓసీ వచ్చింది. ఎనఓసీ ఆధారంగా నందలపాడు ఇనచార్జ్ వీఆర్వోగా ఉన్న నాగేంద్ర, ఇతర అధికారుల సూచనల మేరకు ఈనెల 11న ఆనలైనలో ఎక్కించారన్న ప్రచారం ఉంది. ఈ భూమిలో అంబేడ్కర్ భవనం కట్టేందుకు కొన్నిరోజుల క్రితం వైసీపీ మద్దతుదారులు కంపచెట్లను తొలగించి శుభ్రంచేశారని తెలిసింది.
ఈ సమయంలో జేసీ అశ్మితరెడ్డి పేరిట ఆ స్థలం ఆనలైనలోకి అధికారులు ఎక్కించారన్న విషయాన్ని పసిగట్టిన వైసీపీ మద్దతుదారులు ఆగ్రహావేశాలతో హైదరాబాద్‌లో మోకాలి ఆపరేషన చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెవిలో వేశారని తెలుస్తోంది. ఆనలైన వ్యవహారంపై ఎమ్మెల్యే మండిపడుతూ రెండురోజల క్రితం తహసీల్దార్ నాగభూషణంకు ఫోనచేశారని సమాచారం. ఆనలైనపై ఆరాతీసిన ఆయన బాధ్యులైన డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, కంప్యూటర్ ఆపరేటర్ చంద్రశేఖర్‌లను సెలవులో పంపించాలని ఆదేశించారని ప్రచారం ఉంది. ఎమ్మెల్యే సూ చనల మేరకు తహసీల్దార్ ఆదేశాలను అనుసరించి మంగళవారం డి ప్యూటీ తహసీల్దార్ సెలవుపై వెళ్లగా, కంప్యూటర్ ఆపరేటర్‌ను బలవంతం గా అయినా సెలవులో పంపించాలన్న ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.
అసైన్డ భూమిని ఆనలైనలో ఎక్కించాలంటే తప్పనిసరిగా తహసీల్దార్ అనుమతి అవసరం. ఆయన డిజిటల్ సైన ద్వారానే ఆనలైనలో ఎ క్కుతుంది.అలాంటప్పుడు కేవలం డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు కం ప్యూటర్ ఆపరేటర్ చంద్రశేఖర్‌పై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారన్న ప్రచారం ఉంది. కేవలం వీరిని బలిపశువులు చేసేందుకు వారిపై ఈ వివాదం రుద్ది మిగిలిన వారు తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివాదంపై తహసీల్దార్ నాగభూషణంను ఆంధ్రజ్యోతి వివరణ అడిగేందుకు ప్రయత్నించగా ఫోన లిఫ్ట్ చేయలేదు.