అదృశ్యమైన యువతి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-26T05:11:17+05:30 IST

ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అశ్విని(15) క్రిమి సంహారక మందు సేవించి మృతిచెందిన సంఘటన మండలంలోని ఎర్రజిన్నేపల్లి సమీపంలోని అక్కమ్మగార్ల ఆలయం వద్ద శవం లభ్యం కావడంతో సోమవారం వెలుగు చూసింది.

అదృశ్యమైన యువతి ఆత్మహత్య

పెనుకొండ రూరల్‌, అక్టోబరు 25: ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అశ్విని(15) క్రిమి సంహారక మందు సేవించి మృతిచెందిన సంఘటన మండలంలోని ఎర్రజిన్నేపల్లి సమీపంలోని అక్కమ్మగార్ల ఆలయం వద్ద శవం లభ్యం కావడంతో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రమే్‌షబాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బోయపేటకు చెందిన సంజీవయ్య కుమార్తె అశ్విని ధర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన నాగరాజులు ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం నాగరాజు పెనుకొండకు వచ్చి మేనమామ సంజీవయ్యతో మా ఇద్దరి పెళ్లి చేయాలని కోరడంతో ఇంట్లో పెద్దలు పెళ్లికి అభ్యంతరం చేశారు. నాగరాజు, అశ్విని, ఇంటి నుంచి వెళ్లిపోయారు. మండలంలోని యర్రజిన్నేపల్లి సమీపంలోని అక్కమ్మగార్ల దేవాలయం వద్దకు వెళ్లి వాస్మోల్‌ విషద్రావంను ఇరువురు కలిసి సేవించారు. నాగరాజు కొలుకుని అశ్వినిని అక్కడే వదిలేసి ధర్మవరం ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యాడు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్సపొందుతుండగా ఈనెల 22న నాగరాజు మృతిచెందినట్లు తెలిపారు. వారం క్రితం పెనుకొండ పోలీ్‌సస్టేషనలో అశ్విని తల్లిదండ్రులు కనుబడుటలేదని ఫిర్యాదు చేశారు. సోమవారం ఆలయ పూజారి ఎర్రజిన్నేపల్లి గ్రామసమీపంలోని ఆలయంలో పూజ చేయడానికి వెళ్లి సమీపంలోని నీటి తొట్టె వద్దదుర్వాసన వస్తుండటంతో వెళ్లిచూడగా శవం కనిపించడంతో గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అశ్విని చావు వెనుక ఎవరైనా హస్తముందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే ది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


Updated Date - 2021-10-26T05:11:17+05:30 IST