భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
ABN , First Publish Date - 2021-10-20T07:08:27+05:30 IST
పట్టణంలో ముస్లింలు మంగళవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

కదిరిఅర్బన్ , అక్టోబరు 19 : పట్టణంలో ముస్లింలు మంగళవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమీనియా మసీ దులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నుండి నానా దర్గా, ఇక్బాల్ రోడ్డు, మెయిన్‌రోడ్డు, బైపాస్ మీదుగా శాంతిర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట: మండల వ్యాప్తంగా ముస్లింలు మంగళవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలను జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జీనులకుంట అమాన్ రుసూలుల్లా దర్గా వద్దకు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రత్యేక ప్రా ర్థనలు నిర్వహించారు. దర్గా వద్ద ఖురాన్ పఠనం కూడా ఉదయం నుంచి సాయం త్రం వరకు చేశారు.