మెంటార్‌ డ్యూటీలు మాకొద్దు

ABN , First Publish Date - 2021-10-29T06:04:41+05:30 IST

అమూల్‌ ప్రాజెక్టు అమలుకు మెంటార్‌ డ్యూటీలు తమకొద్దని పశువైద్యాధికారులు స్ప ష్టం చేశారు.

మెంటార్‌ డ్యూటీలు మాకొద్దు
పశుసంవర్థక శాఖ జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న దృశ్యం

పశువైద్యాఽధికారుల నిరసన 

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 28: అమూల్‌ ప్రాజెక్టు అమలుకు మెంటార్‌ డ్యూటీలు తమకొద్దని పశువైద్యాధికారులు స్ప ష్టం చేశారు. గురువారం స్థా నిక పశుసంవర్థక శాఖ జేడీ కార్యాలయం ఎదుట పశువైద్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ వెటర్నరీ ఆస్పత్రుల్లో పశువులు, జీవాలకు వైద్యసేవలు అందించే తమకు అమూల్‌ ప్రాజెక్టు అమలులో కీలకమైన మెంటార్‌ డ్యూటీలు వేయడం సరికాదన్నారు. డాక్టర్లుగా తమ డ్యూటీలు పూర్తిగా వదిలేసి, రెండు నెలలుగా కేవలం మెంటార్‌ డ్యూటీలు చేయాల్సి వస్తోందన్నారు. అమూల్‌ ప్రైవేటు సంస్థ తరపున ఎలాంటి ప్రతినిధులను పెట్టుకోకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పూర్తిగా వాడుకోవడం సరికాదన్నారు. డెయిరీ, కోఆపరేటీవ్‌ సంస్థలు చేయాల్సిన పనులన్నీ పశువైద్యలకు అప్పగించి, ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు.  వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తమ అసలైన డ్యూటీలు చేసేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గురునాథ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:04:41+05:30 IST