వైద్యశాఖ అలర్ట్‌!

ABN , First Publish Date - 2021-12-31T06:38:06+05:30 IST

జిల్లాలో కరోనా థర్డ్‌వేవ్‌ ఒమైక్రాన వైరస్‌ రూపంలో దడ పుట్టిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది.

వైద్యశాఖ అలర్ట్‌!

15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన

జిల్లాలో 2.10 లక్షల మంది  గుర్తింపు

జనవరి 3 నుంచి టీకా పంపిణీ

అనంతపురం వైద్యం, డిసెంబరు 30: జిల్లాలో కరోనా థర్డ్‌వేవ్‌ ఒమైక్రాన వైరస్‌ రూపంలో దడ పుట్టిస్తున్న నేపథ్యంలో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో  ఇప్పటికే ముగ్గురికి  ఒమైక్రాన సోకింది. ఈ నేపథ్యంలో  15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా జనవరి 3 నుంచి జిల్లాలో వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 9, 10వ తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు టీకా వేయనున్నారు. కోవాగ్జిన టీకా మాత్రమే వీరికి వేయనున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల మంది 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లు విద్యాశాఖాధికారులతో లెక్కలు తీసుకొని గుర్తించింది. వీరందరికీ టీకా వేసేందుకు 89 పీహెచసీలు, 44 అర్బన హెల్త్‌ సెంట ర్‌లలో వ్యాక్సిన భద్రపరుస్తున్నారు. 1400 సచివాలయాలు పరిధిలో వ్యాక్సిన పంపిణీ చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జనవరి మూడు నుంచి 10వ తేదీలోపు ఈ పిల్లలందరికీ వ్యాక్సిన వేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు డీఎంహెచఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ యుగంధర్‌ చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటింటికి వెళ్లి పిల్లలకు వ్యాక్సిన వేయాల్సి ఉంది. అలా కాకుండా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం రాష్ట్ర అధికారుల దృష్టికి జిల్లా యంత్రాంగం తీసుకెళ్లింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన వారియర్స్‌కు ప్రికాషన డోస్‌(బూస్టర్‌ డోస్‌) వేయనున్నారు. పంచాయతీ రాజ్‌, రెవెన్యూ, పోలీస్‌, అంగనవాడీ, హెల్త్‌ వర్కర్స్‌కు ఈ డోసు వేయనున్నారు. అది కూడా రెండో డోసు తీసుకొని 9 నెలలు అయి ఉంటే వారికి మాత్రమే బూస్టర్‌ డోసు వేయనున్నారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ డోసు ఇస్తామని డీఐఓ పేర్కొన్నారు. 


జిల్లా ఆస్పత్రిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు

ఒమైక్రాన అలజడితో కేసులు పెరిగితే బాధితులకు వైద్యసేవలు అందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. సైకిల్‌ స్టాండ్‌ ప్రాంతంలో కొత్త ట్రయాన సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఆక్సిజన జనరేటర్‌, బాధితులకు ఆక్సిజన అందించేందుకు మంచాలు, కానసనట్రేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఎండ పడినా బాధితులు ఇబ్బంది పడకుండా ప్ర త్యేక షెడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ కేంద్రం లోనూ వర్షం పడకుండా కొత్త షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు వాష్‌రూమ్స్‌తో పాటు బాధితుల సహాయకులు ఉండేందుకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రూ.40లక్షలతో ఈ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ జగన్నాథం తెలిపారు. 


మరో ఏడుగురికి కరోనా 

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురికి కరోనా సోకినట్టు అధికారులు గురువారం తెలిపారు. కొత్త మరణాలు న మోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 158254 కరోనా కేసులు వచ్చాయి. ఇందులో 157139 మంది ఆరో గ్యంగా కోలుకున్నారు. 1093 మంది మరణించగా ప్రస్తుతం 22 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-31T06:38:06+05:30 IST