కొలువుదీరిన పెనుకొండ పాలకవర్గం

ABN , First Publish Date - 2021-11-23T05:52:17+05:30 IST

పెనుకొండ నగర పంచాయతీ చైర్మనగా ఏడో వార్డు కౌన్సిర ఉమర్‌ ఫారూక్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

కొలువుదీరిన పెనుకొండ పాలకవర్గం
నూతన కౌన్సిలర్లు, చైర్మన, వైస్‌ చైర్మన్లతో మంత్రి శంకర్‌నారాయణ

పెనుకొండ, నవంబరు 22: పెనుకొండ నగర పంచాయతీ చైర్మనగా ఏడో వార్డు కౌన్సిర ఉమర్‌ ఫారూక్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అదేవిధంగా చైర్‌పర్సన్లుగా 5,7వ వార్డులకు చెందిన కౌన్సిలర్లు సునీల్‌ కుమార్‌, నందిని రెడ్డిలు ఎంపికయ్యా రు. సోమవారం స్థానిక నగర  పంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది.  ఈ  కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా సబ్‌ కలెక్టర్‌ నవీన వ్యవహరించగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటరాముడు కొనసాగారు. ముందుగా 20 మంది కౌన్సిల్‌ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన, వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరిగింది. కాగా నూతనంగా ఎంపికైన వారిని మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్‌లు అభినందించారు. 


Updated Date - 2021-11-23T05:52:17+05:30 IST