విధులకు హాజరుకాని 11 మందికి మెమోలు
ABN , First Publish Date - 2021-05-20T05:48:33+05:30 IST
సమయానికి విధులకు హాజరుకాని వారి పై నగర మేయర్ మహమ్మ ద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మందికి మెమో లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

మేయర్ తనిఖీ
అనంతపురం కార్పొరేషన, మే19: సమయానికి విధులకు హాజరుకాని వారి పై నగర మేయర్ మహమ్మ ద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మందికి మెమో లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన ’కార్పొరేషన ఖా ళీ’ కథనానికి మేయర్ స్పం దించారు. నోడల్ అధికారిగా నియమించడంతో కమిషనర్ కార్పొరేషన కార్యాలయానికి తక్కువగా వస్తుండటంతో.. ఆ ముసుగులో కొందరు విధులకు హాజరుకావడం లేదనే క్రమంలో కథనం వెలువడింది. ఇందుకు స్పందించిన మేయర్ బుధవారం ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటల సమయంలో పరిపాలన విభాగానికి చెందిన మెయినహాల్‌కు వెళ్లారు. హాజరును పరిశీలించారు. అక్కడ మేనేజర్‌తో పాటు కొందరు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కరోనా నేపథ్యంలో మధ్యాహ్నం వరకే కేటాయించినా... సమయానికి రాలేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని మండిపడ్డారు. సమయపాలన లేకుండా ఇష్టానుసారం వెళ్తారా అని ప్రశ్నించారు. గైర్హాజరైన 11 మంది సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యమవుతోందనీ, కొందరికే త్వరగా అందుతున్నాయని ఫిర్యాదులొస్తున్నాయన్నారు. వలంటీర్లకు సీఎ్‌ఫఎంఎస్ క్రియేట్ చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. మేయర్ వెంట డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రమోహనరెడ్డి, కమల్‌భూషణ్, వైసీపీ నాయకుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మెమోలు జారీ చేసిన ఇనచార్జి అడిషనల్ కమిషనర్
విధులకు సమయానికి హాజరు కాని 11 మందికి బుధవారం నగరపాలక సంస్థ ఇన చార్జ్ అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి మెమోలు జారీ చేశారు. మేయర్ ఆకస్మిక తనిఖీలో హాజరు కాని వారికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు మేనేజర్ లక్ష్మిదేవి, సూపరింటెండెంట్ సాలమ్మ, సీనియర్ అసిస్టెంట్లు పెద్దక్క, బాలాజి, సునీల్, కుళ్లాయప్ప, రికార్డ్ అసిస్టెంట్ శివకుమార్, ఆఫీస్ సబార్డినేట్ శివశంకరర్‌లతో పాటు మరో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు మెమోలు జారీ చేశారు.