‘స్పందించు-ఆక్సిజన అందించు’కు భారీగా విరాళం

ABN , First Publish Date - 2021-05-08T05:49:00+05:30 IST

కరోనా బారిన పడి ఆక్సిజన అందక చాలా మంది చనిపోతుండటంతో స్పందించు-ఆక్సిజన అందించు అంటూ ఆర్డీటీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది.

‘స్పందించు-ఆక్సిజన అందించు’కు భారీగా విరాళం

 రూ. 7.80 లక్షలు అందజేసిన 

ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ సంస్థ

ధర్మవరంఅర్బన, మే 7: కరోనా బారిన పడి ఆక్సిజన అందక చాలా మంది చనిపోతుండటంతో స్పందించు-ఆక్సిజన అందించు అంటూ ఆర్డీటీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. జైపూర్‌కు చెందిన ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ సంస్థ పెద్ద ఎత్తున విరాళం అందించింది. ఆర్డీటీ డైరెక్టర్‌ విశాలఫెర్రర్‌కు సంస్థవారు యువర్స్‌ ఫౌండేషన ద్వారా 30 పెద్ద ఆక్సిజన సిలిండర్లను కొనుగోలు చేయడా నికి రూ.7.80లక్షలు విరాళాన్ని శుక్రవారం అందజేశారు. వీరికి విశాల ఫెర్రర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆవాస్‌ ఫైనాన్సియర్స్‌ లిమిటెడ్‌ ప్రతినిఽధులు సీఎస్‌ఆర్‌ మనిష్‌తివారి, సుంకు రామ్‌సురేశ యువర్స్‌ఫౌండేషన అధ్యక్షు డు కోటేశ్వరరావు, కార్యదర్శి శీలానాగేంద్ర, కోశాధికారిప్రసాద్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు పోలా ప్రభా కర్‌, మాజీ అధ్యక్షుడు వైకేశ్రీనివాసులు, బండ్లపల్లిరం గనాథ్‌, కార్య వర్గసభ్యులు డాక్టర్‌ సుబ్బారావు, చాంద్‌బాషా, సుంకు సురేశ,  సుంకు సుకుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-08T05:49:00+05:30 IST