వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-21T06:20:11+05:30 IST

మండలపరిధిలోని రేగాటిపల్లి గ్రామం లో ఓ వివాహిత ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వివాహిత ఆత్మహత్య

 ధర్మవరంరూరల్‌, ఆగస్టు20: మండలపరిధిలోని రేగాటిపల్లి గ్రామం లో ఓ వివాహిత ఇంట్లో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివ రాల మేరకు గ్రామానికి చెందిన కా టమయ్య భార్య మాలగుండ్ల మల్లీశ్వర మ్మ(34) కొన్ని నెలలుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుండేంది. పలు ఆస్పత్రులలో చికిత్సలు చేయించినా న యం కాకపోవడంతో మనస్థాపానికి గురై  ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో చీరతో ఫ్యానకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుం ది. పొలం పనులకు వెళ్లి భర్త కాటమయ్య, పిల్లలు  తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తెరవగానే ఉరికి వేలాడుతున్న భార్యను చూసి బోరున విలపించారు.  విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఽధర్మ వరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


Updated Date - 2021-08-21T06:20:11+05:30 IST