వివాహిత బలవన్మరణం
ABN , First Publish Date - 2021-05-05T07:01:36+05:30 IST
ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చే సుకున్నసంఘటన మంగళవారం గాం ధీనగర్‌లో చోటు చేసుకుంది.

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
ధర్మవరంఅర్బన, మే 4: ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చే సుకున్నసంఘటన మంగళవారం గాం ధీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు... కొ త్తపేటకు చెందిన జాన్సీరాజ్, శాంత మ్మ దంపతుల కుమార్తె కవితను గాంధీనగర్‌కు చెందిన శ్రీకాంతకి ఏ డేళ్లక్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తెలు రోషిణి, మిథున, కు మారుడు శివచైతన్యలు ఉన్నారు. వివా హం అయిన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే సోమవారం రాత్రి కవిత(30) ఉరివేసుకుని ఆత్మహత్యానికి ఒడిగట్టింది. గమనించిన కుటుం బసభ్యులు కవితను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికి త్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తర లించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. మృత దేహాన్ని అక్కడ నుంచి పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తర లించారు. అనంతరం కవిత తల్లితండ్రులకు ఫోనచేసి మీ బిడ్డ ఆత్మహత్య చేసు కుందని సమా చారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రికి వచ్చి వికతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి వారు బోరున విలపిం చారు. అప్పటికే కవిత భర్త శ్రీకాంత పరా రయ్యాడు. ఈ నేపథ్యంలో కవిత తల్లితండ్రులు, బంఽధువులు మా బిడ్డను పెళ్లినై ప్పటి నుంచి ఏ రోజు పుట్టింటికి పంపకపోగా అత్త, మామ, భర్త, ఆడపడచులు తరచూ డబ్బు కోసం వేధించేవారన్నారు. మా బిడ్డను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు వాపోయారు. మా బిడ్డ చావుకు భర్త, అత్త, మామ, అడపడచులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.