చికిత్స పొందుతూ వివాహిత మృతి
ABN , First Publish Date - 2021-12-15T05:58:32+05:30 IST
మండలంలోని వేములేటిపల్లి గ్రామానికి చెం దిన సాయికుమార్ భార్య లక్ష్మీనరసమ్మ (19) సోమవారం సాయంత్రం ఉరివేసు కుని ఆత్మహత్యాయత్నాని పాల్పడి మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ లింగన్న తెలిపారు.

కొత్తచెరువు, డిసెంబరు 14: మండలంలోని వేములేటిపల్లి గ్రామానికి చెం దిన సాయికుమార్ భార్య లక్ష్మీనరసమ్మ (19) సోమవారం సాయంత్రం ఉరివేసు కుని ఆత్మహత్యాయత్నాని పాల్పడి మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ లింగన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.,... వేములే టిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ గత కొద్ది నెలల నుండి కడుపునొప్పితో బాధపడుతుండేదని అయితే ఈ నొప్పి భరించలేక సోమవారం సాయంత్రం అత్తగారి ఇంటిలో ఉరివే సుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ఇది గమనిం చిన కు టుంబసభ్యులు ఆమెను వెంటనే ధర్మవరం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయి తే అక్కడ చికిత్స పొందు తూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఆమెకు ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారు.