మేజర్‌ పంచాయతీలే టార్గెట్‌..!

ABN , First Publish Date - 2021-02-06T06:51:14+05:30 IST

మేజర్‌, ఆదాయం వనరులున్నా పంచాయతీల్లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్పుంచ్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి.

మేజర్‌ పంచాయతీలే టార్గెట్‌..!
సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్న టీడీపీ నాయకులు

 గెలుపు గుర్రాల కోసం వేట

 ఏకాభిప్రాయానికి బుజ్జగింపులు


హిందూపురం, ఫిబ్రవరి 5: మేజర్‌, ఆదాయం వనరులున్నా పంచాయతీల్లో పాగా వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్పుంచ్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఆశావాహులు నుంచి తీవ్ర పోటీ పడుతున్నా నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తలలు పట్టుకుని ఏకాభిప్రాయం కోసం బుజ్జగింపులకు దిగాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా హిందూపురం, పెనుకొండ నియోజక వర్గాల్లోని మేజర్‌ పంచాయతీతోపాటు ఆదాయం వనరులున్నా పంచాయతీలపై ప్రధాన పార్టీలు టార్గెట్‌ పెట్టి ఎంపిక చేస్తున్నా యి. మేజర్‌ పంచాయతీలతోపాటు ఆదాయవనరులున్నా అన్నీ పంచాయతీలు దాదాపుగా రిజర్వేషన్లు వర్గాలకు కేటాయింపు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆ వర్గాల్లోనే ఆర్థిక బలం ఉన్నా గెలుపు గుర్రాల అభ్యర్థుల వేట సాగిస్తున్నారు. హిందూపురం నియోజక వర్గంలో లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు, కిరెకెర, తూమకుంట, గోళ్లాపురం పంచాయతీల్లో వైసీపీ, టీడీపీలో ఆశావాహు ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో కిరెకెర, గోళ్లాపురం, లేపాక్షి, కోడూరులో సర్పుంచ్‌ స్థానాలకు టీడీపీ మద్దతుదారుల మధ్య ఏకాభిప్రాయం రాగా చిలమత్తూ రు, తూమకుంటలో ఆశావాహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక అధికార వైసీపీలో వర్గవిభేధాలున్నా నేపథ్యంలో ఇరువైపులా తీవ్ర పోటీ పడుతునట్లు తెలుస్తోం ది. దీంతో ప్రతి పంచాయతీకి ఇద్దరూ, ముగ్గురేసీ అభ్యర్థుల జాబితా సిద్దం చేసి ఏకాభిప్రాయానికి బుజ్జగింపులతో పంచాయతీ ఓకోలిక్కిరాలేదని ఆపార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

  మంత్రి శంకరనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజక వర్గంలో పరిగి, కొడిగెనహళ్లి, రొద్దం, సోమందేపల్లి, గోరంట్ల మేజర్‌ పంచాయతీలతోపాటు కియ పరిశ్రమ రాకతో ఆదాయ వనరులున్నా గు ట్టూరు, ఎర్రమంచి, దుందేబండ, అమ్మవారుపల్లి పంచాయతీల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చాలా మంది ఆశావాహులు పోటీకి సిద్దం అవుతున్నారు. సోమందేపల్లి, గుట్టూరు పంచాయతీలకు టీడీపీ ఎంపికలో ఏకాభిప్రాయం రాగా మిగిలిన పంచాయతీల్లో కూడా దాదాపుగా ఏకాభిప్రాయం దిశగా ఎంపిక ప్రక్రియ సాగుతోం ది. గోరంట్లలో బలమైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణ చేస్తోంది. ఇక అధికార పార్టీలో మాత్రం ఆశావాహులు మధ్య తీవ్ర పోటీ నెలకొనగా గోరంట్లలో వైసీపీ సర్పుంచ్‌ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారు కాగా మిగిలిన పంచాయతీకి ఇద్దరు, ముగ్గురేసి మద్దతుదారుల అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తోంది. అయితే పైకి ఎంత మంది పోటీకి సిద్దం అవుతున్నా ఏపంచాయతీలో ఎవరు బరిలో నిలపాలని మంత్రి జాబితా సిద్దం చేసినట్లు నామినేషన్లు వరకు సాగదీత చేస్తున్నట్లు తెలుస్తోంది. మేజర్‌ పంచాయతీల అభ్యర్థుల ఎంపికలో సమావేశాలు పెట్టి ఏకాభిప్రాయానికి కసరత్తు చేస్తున్నారు. సర్పుంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయింపు నేపథ్యంలో ఉప సర్పుంచ్‌ స్థానాలకు ఇప్పుడే పోటీ పడు తూ హమీలు తీసుకుంటున్నారు. అన్ని మేజర్‌ పంచాయతీలతోపాటు ఆదాయ వనరులున్నా పంచాయతీలను ప్రత్య ర్థి పార్టీ అభ్యర్థుల బలబలాను బేజారు వేసుకుని దీటైన అభ్యర్థులను నిలిపేందుకు వైసీపీ, టీడీపీలతోపాటు బీజే పీ, జనసేనలు ఎత్తుకుపైఎత్తు వేస్తున్నారు. గ్రామీణ స్థా యిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపుగా పూర్తిచేసినా మేజర్‌ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రు. ఈనెల 10 నుంచి నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం నేపథ్యంలో ఏపార్టీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఆసక్తిగా మారింది.


Updated Date - 2021-02-06T06:51:14+05:30 IST