దేశ రాజకీయ గమనాన్ని మార్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

ABN , First Publish Date - 2021-11-02T06:17:59+05:30 IST

అమరజీ వి పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధకుడు మాత్రమే కా దని, దేశ రాజకీయ గమనాన్ని మార్చిన మహనీయుడని జిల్లా క లెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు.

దేశ రాజకీయ గమనాన్ని మార్చిన   మహనీయుడు పొట్టి శ్రీరాములు
కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ తదితరులు


 కలెక్టర్‌ నాగలక్ష్మి

అనంతపురం,నవంబరు1(ఆంధ్రజ్యోతి): అమరజీ వి పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధకుడు మాత్రమే కా దని, దేశ రాజకీయ గమనాన్ని మార్చిన మహనీయుడని జిల్లా క లెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. పొట్టిశ్రీరాములు ఆమరణదీక్ష కారణంగానే భాషా ప్రాతిపదికన రాష్ర్టాలు ఏర్పడ్డాయని పే ర్కొన్నారు. ఆంధ్రప్రదేశ అవతరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ముందుగా రెవెన్యూ భవన ఆవరణ లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సాయుధ బలగాలు జా తీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనం తరం రెవెన్యూ భవనలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ తో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌, జడ్పీ చైర్‌ పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నగర మేయర్‌ వసీం, జేసీలు డాక్టర్‌ సిరి, నిశాంతి, గంగాధర్‌ గౌడ్‌, డిప్యూటీ మేయర్లు వాసంతిసాహిత్య, కొగటం విజయ భా స్కర్‌రెడ్డి, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన హరితా రాజగో పాల్‌, ఆర్టీసీ రీజినల్‌ డైరెక్టర్‌ మంజుల, ఏడీసీసీ బ్యాంకు చైర్‌ పర్సన లిఖిత, అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌ తదితరు లు హాజరయ్యారు. పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ పొట్టిశ్రీ రాములు ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నా రు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆమె ఆ కాంక్షించారు. అభివృద్ధితో పాటు పరిశుభ్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన ఏపీ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆ హూతులను అలరించాయి. కార్యక్రమంలో పలు శాఖల ఉన్న తాధికా రులు, కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.

అనంతపురం వైద్యం: ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను సోమవారం టీడీపీ జిల్లా  కార్యాలయంలో  ఆ పార్టీ నాయకు లు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి  పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చే సి నివాళి అర్పించారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ అ నంతపురం జిల్లా పరిశీలకులు ఎంఎల్‌సీ బీటీనాయుడు, హిం దూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకరచౌదరి, కందికుంట ప్రసాద్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, తలారి ఆది నారాయణ, దేవళ్ల మురళి, జడ్పీ మాజీ చైర్మన పూల నాగ రాజు, అనంత, హిందూపురం పార్లమెంట్ల ప్రధాన కార్యదర్శు లు శ్రీధర్‌ చౌదరి, అంబికా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ మా జీ చైర్మన గౌస్‌మోద్దీన, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య క మిటీ స భ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి, సీనియర్‌ నాయకు లు సరి పూటి సూర్యనారాయణ, బాంబేడయింగ్‌ నాగన్న, పూ లకుం ట నాగార్జున, నాయకులు సరిపూటి రమణ, డిష్‌ నాగ రాజు, నారాయణస్వామి యాదవ్‌, మారుతిగౌడ్‌, వెంకటేష్‌ గౌడ్‌ త దితరులు పాల్గొన్నారు. అలాగే పొట్టిశ్రీరాములు విగ్రహానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్యచౌదరి, తెలుగురైతు రాష్ట్ర కా ర్యనిర్వహక కార్యదర్శి రాయల్‌మురళి, టీడీపీ అనంత పార్ల మెంటు అధికార ప్రతినిధి కృష్ణకుమార్‌, నాయకులు చక్కానా గేం ద్ర, ప్రకాష్‌, చెన్నప్ప, వెంకటప్ప, మోహన, హేమంత, రమాదేవి, నూర్జహాన తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 



Updated Date - 2021-11-02T06:17:59+05:30 IST