రూ.10లక్షలు విలువచేసే మద్యం సీజ్‌

ABN , First Publish Date - 2021-11-10T05:20:47+05:30 IST

కర్ణాటక నుండి పెనుకొండకు అక్రమంగా తరలిస్తున్న రూ.10లక్షలు విలువచేసే మద్యంతోపాటు ఐదు మంది వ్యక్తులను అరె్‌స్టచేసి రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు తెలిపారు.

రూ.10లక్షలు విలువచేసే మద్యం సీజ్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రామ్మోహనరావు

పెనుకొండ, నవంబరు 9: కర్ణాటక నుండి పెనుకొండకు అక్రమంగా తరలిస్తున్న రూ.10లక్షలు విలువచేసే మద్యంతోపాటు ఐదు మంది వ్యక్తులను అరె్‌స్టచేసి రెండు వాహనాలను సీజ్‌ చేసినట్లు సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ రామ్మోహనరావు తెలిపారు. మంగళవారం స్థానిక ఎక్సైజ్‌ స్టేషనలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన శ్రీనివాస్‌, మధు, శివకుమార్‌, జయకృష్ణ, పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన రంగేనాయక్‌లు కలిసి ఒక బృందంగా ఏర్పడి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించవచ్చన్న దురాశతో మారుతి సుజుకి, టాటాయేస్‌ వాహనాల్లో బెంగళూరు నుంచి రూ.10లక్షలు విలువచేసే 170బాక్సుల విస్కీ, టెట్రా ప్యాకెట్లను తీసుకుని పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామ సమీపంలోని క్వారీ వద్ద వేరే వాహనాల్లో మద్యం బాక్సులు ఎక్కిస్తుండగా సెజ్‌ ఇనస్పెక్టర్‌ సుబ్బారెడ్డి, నాగేంద్రప్రసాద్‌ సిబ్బందితో దాడిచేసి నిందితులను అరె్‌స్టచేసి మద్యంతోపాటు వాహనాలను సీజ్‌చేసి పెనుకొండ స్టేషనలో కేసు నమోదుచేసినట్లు తెలిపారు. సమావేశంలో పెనుకొండ ఈఎస్‌ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-10T05:20:47+05:30 IST