విద్యుత అధికారుల నిర్లక్ష్యానికి ప్రైవేటు లైనమన బలి

ABN , First Publish Date - 2021-12-31T05:32:35+05:30 IST

మండలంలోని కల్లూరు గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో ప్రైవేటు లైనమన రామాంజనేయులు (38) మరణించాడు. గ్రామస్థు లు తెలిపిన వివరాల మేరకు.. హిందూపు రం మండలం పూలకుంట గ్రామానికి చెందిన రా మాంజనేయులు ప్రైవేటు లైనమనగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు.

విద్యుత అధికారుల నిర్లక్ష్యానికి ప్రైవేటు లైనమన బలి

లేపాక్షి, డిసెంబరు 30: మండలంలోని కల్లూరు గ్రామంలో గురువారం విద్యుదాఘాతంతో ప్రైవేటు లైనమన రామాంజనేయులు (38) మరణించాడు. గ్రామస్థు లు తెలిపిన వివరాల మేరకు.. హిందూపు రం మండలం పూలకుంట గ్రామానికి చెందిన రా మాంజనేయులు ప్రైవేటు లైనమనగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. కల్లూరు గ్రా మ పరిధిలోని వ్యవసాయ పొలంలో నూతనంగా తవ్విన బోరుకు మోటారు అమర్చేందుకు సిబ్బందితో కలిసి గురువారం వెళ్లారు. ఎల్‌సి ద్వారా సబ్‌స్టేషనలో సమాచారం అందించారు. పొలంలో మోటారుకు విద్యుత సరఫరా ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. వి ద్యుత అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎల్‌సి తీసుకున్నా.. స్తంభానికి విద్యుత సరఫరా అవుతోంది. దీని ని గమనించని రామాంజనేయులు విద్యుత స్తంభం ఎక్కగానే షాక్‌ తగిలి, కిందపడిపోయాడు. వెం టనే స్థానికులు 108లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి త రలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామాంజనేయులుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పెద్దదిక్కు చనిపోవడంతో ఆ కుటుం బం వీధిన పడింది. రామాంజనేయులు మృతిపై ఎస్‌ఐ మునీర్‌అహ్మద్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.




Updated Date - 2021-12-31T05:32:35+05:30 IST