విధులకు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ డుమ్మా!

ABN , First Publish Date - 2021-07-12T05:59:46+05:30 IST

ఏకంగా విధులకు డుమ్మా కొడుతూ ఓ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలనెలా వేతనాన్ని తీసుకుంటున్న వైనం రాయదుర్గంలో వెలు గు చూస్తోంది.

విధులకు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ డుమ్మా!


ఆమ్యామ్యాలతో అధికారుల సర్దుబాటు 

రాయదుర్గం, జూలై 11 : ఏకంగా విధులకు డుమ్మా కొడుతూ ఓ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలనెలా వేతనాన్ని తీసుకుంటున్న వైనం రాయదుర్గంలో వెలు గు చూస్తోంది. విద్యుత్‌ శాఖలో పట్టణానికి సంబంధించి లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్లును యేడాది క్రితం బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యం పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. అతని స్థా నంలో తాత్కాలికంగా ప్రైవేటు వ్యక్తిని నియమించి రూ.200 ప్రకారం రో జు కూలీ ఇస్తూ పనులు కానిచ్చేస్తున్నట్లు ఆ శాఖలో గుప్పుమంటోంది. దీంతో విధులకు రాకుండా డుమ్మా కొడుతూ వేతనాన్ని మాత్రం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా విద్యుత్‌ సరఫరాకు సంబంధించి అంతరాయాలు ఏర్పడినప్పుడు మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఆయనపై వుంటుంది. వీటితో పాటు విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన రీడింగ్‌లను తీయాల్సి వుంటుంది. ఈ విధులను నిర్వర్తించాల్సిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎగనామం పెట్టి డుమ్మా కొడుతుండటంతో మిగిలిన ఉద్యోగులపై ఆ బాధ్యతలు పడుతున్నాయి. పైగా ప్రశ్నించిన వారికి మాత్రం ఉన్నతాధికారులు సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధానంగా విధులకు డుమ్మా కొట్టే వ్య వహారం కప్పి పుచ్చేందుకు ఉన్నతాధికారులకు నెలసరిగా ఆమ్యామ్యాలు చెల్లించి సర్దుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కూడా ఆ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు వంతపాడుతున్నట్లు తెలియవచ్చింది. బాధ్యతలకు దూ రంగా ఉంటూ భారాన్నంతా తమపై వేస్తుండటంతో తోటి ఉద్యోగులు పె దవి విరుస్తున్నారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మామూళ్లతో సర్దుబాటు చేసి నెలసరి వేతనానికి మాత్రం ఇబ్బంది లేకుండా పరోక్షంగా అతనికి మ ద్దతు పలుకుతున్నట్లు ఆ శాఖలో చర్చసాగుతోంది. ఇప్పటికే సిబ్బంది కొర త వెంటాడుతున్న నేపథ్యంలో విధులకు డుమ్మాకొట్టినా వేతనాన్ని చెల్లి స్తూ అండగా నిలుస్తున్న అధికారులపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 


ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం : బాలచంద్ర, విద్యుత్‌ ఏఈ 

విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. యేడాది క్రితం వెంకటేశ్వర్లు ఇక్కడికి బదిలీపై వచ్చారు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. విధులకు హాజరుకావడం లేదనే విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం.


Updated Date - 2021-07-12T05:59:46+05:30 IST