పార్టీ కోసం కష్టపడి పనిచేద్దాం

ABN , First Publish Date - 2021-07-12T05:49:16+05:30 IST

మంచి రోజులు మళ్లీ వస్తా యి... పార్టీ కోసం మనం సమిష్టిగా కష్టపడి పనిచేద్దామని తెలు గు మహిళలకు మాజీమంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీ రామ్‌ సూచించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేద్దాం
పరిటాల సునీత, శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న తెలుగు మహిళ కమిటీ నేతలు

తెలుగు మహిళలకు మాజీ మంత్రి పరిటాల సునీత సూచన

అనంతపురం వైద్యం, జూలై11: మంచి రోజులు మళ్లీ వస్తా యి... పార్టీ కోసం మనం సమిష్టిగా కష్టపడి పనిచేద్దామని తెలు గు మహిళలకు మాజీమంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీ రామ్‌ సూచించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని తెలుగు మహిళ కమిటీలను పార్టీ ప్రకటించింది. అందులో పదవులు లభించి న ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలకు చెందిన తెలుగు మహిళ నేతలు రామసుబ్బమ్మ, పెద్దలక్ష్మీదేవి, మోదుపల్లి ధనలక్ష్మి, మా రెక్క, ముతుకూరు బీబీ, ఉరు ముల చంద్రకళ, కత్తుల సునీత, సునంద, హేమలత తదితరులు ఆదివారం పరిటాల సునీత, శ్రీ రామ్‌ జిల్లా కేంద్రంలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మొక్కలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. నూ తనంగా పదవులు పొందిన తెలుగు మహిళలను పరిటాల సు నీత, శ్రీరామ్‌ అభినందించారు. అనంతరం వారితో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... వైసీపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత అరాచకాలు పెరిగి పోయాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నాయన్నారు. అధికార పార్టీ నా యకుల కనుసన్నలోనే ఈ అరాచకాలు సాగడం బాఽధాకరమన్నారు. ఇలాంటి అరాచ కాలపై మనం ధైర్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మీకు పార్టీతో పాటు మేము అండగా ఉంటామని భవిష్యత్తులో పార్టీలో మంచి గౌరవం దక్కుతుందని సూచించారు. 


Updated Date - 2021-07-12T05:49:16+05:30 IST