టీడీపీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేద్ధాం : గుండుమల

ABN , First Publish Date - 2021-12-08T05:22:43+05:30 IST

తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అందరూ సమష్టిగా ముందుకు సాగుదామని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేద్ధాం : గుండుమల
గుండుమలను సన్మానిస్తున్న నాయకులు

మడకశిరటౌన, డిసెంబరు 7: తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అందరూ సమష్టిగా ముందుకు సాగుదామని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం బాలాజీ నగర్‌లో నూతన కమిటీ తెలుగు యువత టీఎనఎ్‌సఎ్‌ఫ కమిటీలో అకాశం కల్పించినందుకు పలువురు గుండుమల తిప్పేస్వామిని సన్మానించారు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఎం.బాలకృష్ణతోపాటు 40 మందిని కమిటీలో కొత్తగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపడతారన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ల ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని పిలుపునిచ్చారు.Updated Date - 2021-12-08T05:22:43+05:30 IST