టీడీపీ అభ్యున్నతికి అంకిత భావంతో పనిచేద్దాం
ABN , First Publish Date - 2021-07-24T06:19:13+05:30 IST
తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అం కిత భావంతో పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు.

జన్మదిన వేడుకల్లో ఉన్నం హనుమంతరాయచౌదరి పిలుపు
అభిమానులు, పార్టీ శ్రేణుల నడుమ కోలాహలంగా వేడుకలు
కళ్యాణదుర్గం, జూలై 23: తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం అం కిత భావంతో పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉన్నం జన్మదిన వే డుకలు పట్టణంలో కోలాహలంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ వి గ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉన్నం తనయులు మా రుతిచౌదరి, ఉదయ్‌చౌదరిలతో కలిసి నాయకులు, కార్యకర్తలు అభిమాను ల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఉన్నంకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశా రు. అనంతరం ఉన్నం వ్యక్తిగత కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. అభిమానులతో కలిసి కేక్ కట్‌చేసి మి ఠాయిలు పంపిణీ చేశారు. ఉన్నం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉన్నం మాట్లాడుతూ ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కల్పించిన టీడీపీ అధినేత, జాతీయ అధ్యక్షు లు నారాయచంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారాలోకే్‌షలకు ప్ర త్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపట్ల చూపుతున్న ఆదరాభిమానాలు మరువరానివన్నారు. ఎల్లవేళలా నాయకులు, కార్యకర్తలకు వె న్నంటివుండి ప్రజాసమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హా మీ ఇచ్చారు.
ఇదేతరహాలోనే పార్టీ బలోపేతానికి ఐక్యతతో కృషిచేసి రా బోవు రోజుల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు సంఘటితం కా వాలని పిలుపునిచ్చారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ పార్టీని రాష్ట్రంలో నే కళ్యాణదుర్గంలో పతాకస్థాయికి తీసుకెళదామన్నారు. అనంతరం ప్రజల తో మమేకమై శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ చ్చిన అభిమానులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉన్నంను అభిమానులు గజమాలలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన పాపంపల్లి రామాంజినేయులు, మాజీ వైస్ ఎంపీపీ గోళ్ల వెంకటేశులు, ప్రి యాంక, మల్లికార్జున, కొండాపురం సర్పంచు గుండ్లపల్లి త్రివేణిలాల్‌కృష్ణ, గరికపాటి హరికృష్ణ, ఆర్‌కే రాజు, ధనుంజయ నాయక్, జీపీ నారాయణ, జీవీ ఆంజినేయులు, గరికపాటి కిషోర్, శ్రీరాములు, తిప్పేస్వామి, నాగిరెడ్డిపల్లి వెంకటేశులు, కొనాపురం సత్తి, డీకే రామాంజినేయులు, పాలవెంకటాపురం సురేంద్ర, శెట్టూరు గురు, కరిడిపల్లి రంగప్ప, తిమ్మప్పచౌదరి, ఊ టంకి రామాంజినేయులు, గొర్ల గోవిందప్ప, మల్లిపల్లి నారాయణ, కొల్లప్ప, మల్లేష్, రాము పాల్గొన్నారు.