అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం

ABN , First Publish Date - 2021-11-02T06:20:32+05:30 IST

అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానంతో రాష్ట్రం అవతరించిందని, అతని ఆశయసాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం

రాష్ట్ర  అవతరణ దినోత్సవంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి

ధర్మవరం, నవంబరు1: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానంతో రాష్ట్రం అవతరించిందని, అతని ఆశయసాధనకు కృషి చేద్దామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక కాలేజ్‌ సర్కిల్‌లో ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలువేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలనే తపనతో పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి తెలుగువారి గుండెల్లో అమరజీవిగా నిలిచారన్నారు. 

బీజేపీ ఆధ్వర్యంలో.. కాలేజ్‌ సర్కిల్‌ల్లో పొట్టిశ్రీరాముల విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని బీజేపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డిష్‌రాజు, రాప్తాటి రాము, దుస్సాక్రిష్ణ, శంకరచంద్ర, బోడగల గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

యువర్స్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. రాష్ట్ర అవతరణ దినోత్సవం సం దర్భంగా యువర్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాముల విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్‌ ప్రతినిధులు బం డ్లపల్లి రంగనాథ్‌, పోలాప్రభాకర్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: అమరజీవి పొట్టిశ్రీరాములు రాష్ట్ర అవతరణకు  చేసిన త్యాగం మరవలేనిదని యావత్తు రాష్ట్రం అంతా ఆయనను స్మరించు కోవాలని ఎంపీపీ గిరకరమాదేవి పేర్కొన్నారు. సోమవారం  రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలపరిషత్‌ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో వైసీపీ నాయకులు గిరక సంగాలప్ప, పిట్టా నరసింహులు, కార్యాల య సిబ్బంది పాల్గొన్నారు.

కదిరి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం  పొట్టిశ్రీ రాములు విగ్రహానికి కదిరి మున్సిపాల్టీ ఛైర్‌పర్సన్‌ నజీమున్నీసా, వైస్‌ ఛైర్‌ప ర్సన్‌ కొమ్ము గంగాదేవీ, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, కౌన్సిలర్‌లు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తెలుగువారందరికీ చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు అన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ గోపీనాథ్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారి రహిమా న్‌, మెప్మా అధికారి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-02T06:20:32+05:30 IST