న్యాయవాదులు నిత్య విద్యార్థుల్లా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-20T06:19:51+05:30 IST

రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, మోసాల నేపథ్యంలో న్యాయవాదులు నిత్య విద్యార్థుల్లా న్యాయశాస్త్రం చదువుతుండాలని జిల్లా అదనపు జడ్జి స్వర్ణప్రసాద్‌ అన్నారు.

న్యాయవాదులు నిత్య విద్యార్థుల్లా ఉండాలి
లైబ్రేరి గదిని ప్రారంభిస్తున్న ఏడీజే

హిందూపురం టౌన్‌, ఆగస్టు 19 : రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, మోసాల నేపథ్యంలో న్యాయవాదులు నిత్య విద్యార్థుల్లా న్యాయశాస్త్రం చదువుతుండాలని జిల్లా అదనపు జడ్జి స్వర్ణప్రసాద్‌ అన్నారు. గురువారం కోర్టు ప్రాంగణంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రేరి గదిని ఏడీజే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజం జెట్‌ స్పీడ్‌తో ముందుకు పోతుందని, ప్రతిరోజూ న్యాయవ్యవస్థకు, న్యాయవాదులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.   నేరస్తులు కొత్తకొత్త పంతాల్లో నేరాలకు పాల్పడుతున్నారు.  వారిని కఠినంగా శిక్షించాలంటే న్యాయవాదులు పుస్తకాలను పటనం చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌జడ్జి వెంకటేశ్వర్లు, స్పెషల్‌ మెజిస్ర్టేట్‌ ఆనందతీర్థ, సెకెండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ రంగనాయకులు, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు ఇందాద్‌, కార్యదర్శి శిశంకర్‌, లైబ్రేరి కార్యదర్శి మురళి, న్యాయవాదులు సిద్దలింగప్ప, శ్రీనివాసరెడ్డి, ఏజీపీ సుదర్శన్‌, కళావతి, శ్రీ రాములు, ఫణికుమార్‌, శ్రీరామిరెడ్డి, క్రిష్ణమూర్తి, నాగరాజు, హరీష్‌, వీరసేన, ఈశ్వర్‌  తదితరులు  పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-20T06:19:51+05:30 IST