వజ్రోత్సవ వెబ్‌సైట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-28T05:50:12+05:30 IST

జేఎనటీయూ వజ్రోత్సవ వేడుకల వివరాలను ఆనలైన ద్వారా తిలకించేందుకు నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించామని వీసీ రంగ జనార్దన తెలిపారు.

వజ్రోత్సవ వెబ్‌సైట్‌ ప్రారంభం
అధికారులతో సమీక్షిస్తున్న వీసీ

అనంతపురం అర్బన, నవంబరు 27: జేఎనటీయూ వజ్రోత్సవ వేడుకల వివరాలను ఆనలైన ద్వారా తిలకించేందుకు నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించామని వీసీ రంగ జనార్దన తెలిపారు. శనివారం వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై డైరెక్టర్లు, కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన రిజిస్ర్టార్‌ శశిధర్‌తో కలిసి మాట్లాడారు. వెబ్‌సైట్‌ ద్వారా పూర్వ విద్యార్థుల ఆగమనాన్ని, వసతి సౌకర్యాలను ముందుగానే తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ విజయకుమార్‌, డైరెక్టర్‌ శోభాబింధు, ప్రిన్సిపాల్‌ సుజాత, వైస్‌ ప్రిన్సిపాల్‌ దుర్గప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:50:12+05:30 IST