రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-29T06:08:14+05:30 IST

మండలంలోని తమ్మినాయనపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆగివున్న లారీని మరోలారీ వెనుక నుంచి ఢీకొనడంతో క్లీనర్‌ కుమార్‌ (17) మృతిచెందగా.. డ్రైవర్‌ రవికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్‌ మృతి

గోరంట్ల, అక్టోబరు 28: మండలంలోని తమ్మినాయనపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం ఆగివున్న లారీని మరోలారీ వెనుక నుంచి ఢీకొనడంతో క్లీనర్‌ కుమార్‌ (17) మృతిచెందగా.. డ్రైవర్‌ రవికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు వైపు టైల్స్‌ తీసుకెళ్తున్న లారీ బ్రేక్‌డౌన అవడంతో రోడ్డుపైనే ఆపారు. బియ్యం తీసుకెళ్తున్న మరో లారీ ఆగివున్న లారీని తెల్లవారుజామున ఢీకొంది. వెనుక ఉన్న లారీ క్యాబినలో ఉన్న కర్ణాటకలోని బాగేపల్లి సమీపానగల చిక్కతమ్మనహళ్లికి చెందిన క్లీనర్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రెవర్‌ రవికుమార్‌కు రెండుకాళ్లు విరిగి, తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. సీఐ జయనాయక్‌ ప్రమాద స్థలానికి చేరుకుని, క్రేన సాయంతో రెండు లారీలను విడదీసి, క్యాబినలో ఇరుక్కుపోయిన క్లీనర్‌ శవాన్ని వెలికి తీశారు. ప్రమాదంపై కేసు నమోదుచేసి, శవాన్ని పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-10-29T06:08:14+05:30 IST