పక్కా స్కెచ..!

ABN , First Publish Date - 2021-12-30T06:47:22+05:30 IST

అధికార వైసీపీ నేతలు రూ. కోట్లు కొట్టేసేందుకు పక్కా స్కెచ వేశారు. దీని కోసం ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధి భర్తే రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో స్థానిక నా యకులూ భాగస్వాములయ్యారు. ఇంకేముంది అధికారం మాటున భూ ఆక్రమణకు తెరలేపారు.

పక్కా స్కెచ..!

అనుమతి లేకపోయినా డీ పట్టాభూమి 

కొనుగోలుకు ఒప్పందం

హక్కుదారుడి భూమితో పాటు 

వంకభూమి ఆక్రమణ

గ్రావెల్‌తో భూమి చదును

సిద్ధమైన లే అవుట్‌ మ్యాప్‌

రూ.కోట్లు కొల్లగొట్టేందుకు 

అధికార పార్టీ నేతల మాస్టర్‌ ప్లాన


అనంతపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అధికార వైసీపీ నేతలు రూ. కోట్లు కొట్టేసేందుకు పక్కా స్కెచ వేశారు. దీని కోసం ఆ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధి భర్తే రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో స్థానిక నా యకులూ భాగస్వాములయ్యారు. ఇంకేముంది అధికారం మాటున భూ ఆక్రమణకు తెరలేపారు. డీ-పట్టా భూమిని కొనుగోలు చేసేందుకు అనుమతుల్లేకపోయినా.. అధికారం మాటున డీ-పట్టాదారుడిని నయానోభయానో... లోబరుచు కున్నారు. ఆ డీ-పట్టా భూమి హక్కుదారుడితో లోపా యికారి ఒప్పందం చేసుకున్నారు. తక్కువ ధరకు ఆయన కున్న భూమిలో కొంత భాగాన్ని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. దీంతోనే ఆ కొనుగోలు చేసిన భూమికి హక్కుదారులమై పోయినట్లు ఆ అధికార పార్టీ నేతలు ఏకంగా భూమిని గ్రావెల్‌తో చదును చేశారు. అంతటితో ఆగలేదు. ఆ భూమికి ఆనుకొని ఉన్న రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ వంక పోరంబోకు భూమిని కొంత కలుపుకున్నారు. ఆ భూ మిని చదును చేసేందుకుగానీ ప్లాట్ల రూపంలో విక్ర యించేందుకుగానీ అనుమతుల్లేకపోయినా కాగితాల్లో లేఔ ట్‌ సిద్ధం చేశారు. ఆ భూమి ఎక్కడో కాదు అనంత పురం-తాడిపత్రి ప్రధాన రహదారిలో ఉంది. అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న బుక్కరా యసముద్రంలోని పోలీ్‌సస్టేషన పక్కనే కబ్జాకు గురైన భూమి ఉందంటే దాని విలువ ఏపాటిదో అర్థం చేసుకో వచ్చు. తహసీల్దార్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న డీ-పట్టా భూమిలో గ్రావెల్‌ తోలి చదును చేస్తున్నా... ప్రభుత్వ వంకపోరంబోకు భూమిని కబ్జా చేస్తున్నా... రెవె న్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. 


ఆ భూమి విలువ రూ. కోట్లలో...

అధికార పార్టీ నేతలు డీ పట్టాదారుల నుంచి కొను గోలు చేసినట్లు చెప్పుకుంటున్న భూమితో పాటు... ఆక్ర మించుకున్న వంకపోరంబోకు భూమి విలువ దాదాపు రూ. 6 కోట్లదాకా ఉండొచ్చని అంచనా. ఇందులో డీ-పట్టాదారుడిది 71 సెంట్లు కాగా... వంకపోరంబోకు భూ మి మరో 29 సెంట్లు మొత్తం ఎకరాదాకా అధికార పార్టీ నేతలు గ్రావెల్‌తో చదును చేశారు.  ఈ భూ దందా వ్యవ హారం పరిశీలిస్తే... బుక్కరాయసముద్రం పోలీ్‌సస్టేషన పక్కన 539 సర్వే నెంబరులో 4.28 ఎకరాలు, 540 సర్వే నెంబరులో 3.53 ఎకరాల భూమి వంకపోరంబోకు కింద రెవెన్యూ డైక్లాట్‌లో ఉంది. 1976 నవంబరులో బుక్క రాయసముద్రం గ్రామానికి చెందిన పి. అంజినప్ప కుమా రుడు రామస్వామి, ఆయన కుమారుడు శ్రీనాఽథ్‌కుమార్‌ లకు డీఏఆర్‌డీఐఎస్‌ నెంబరు 152-1386 కింద 539-2 సర్వే నెంబర్‌లో 0.38 సెంట్లు, 540-2 సర్వే నెంబర్‌లో 0.33 సెంట్ల భూమికి డి-పట్టా మంజూరు చేశారు. అప్పటి నుంచి కొద్దిరోజులు మాత్రమే వారు సాగులో ఉన్నారు. 1990 నుంచి ఈ భూమిలో వారు సాగులో లేరు. అప్పటి ఆ 71 సెంట్ల భూమి ఖాళీగానే ఉంది. 


ఖాళీ భూమిని కాజేసేందుకు ప్లాన అమలిలా...

రహదారుల పక్కన భూముల విలువలు అమాంతంగా పెరగటంతో ఖాళీగా ఉన్న ఆ భూమిపై అధికార పార్టీ నా యకుల కన్ను పడింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధి భర్త దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లినట్లు సమాచారం. కబ్జా చేస్తే... బహిరంగం అవుతుందేమోనని అనుకున్నారో ఏమోగానీ... కొత్త వ్యూహాన్ని రచించారు. ఆ ఖాళీ స్థలంలో గ్రామ సచివాలయం కట్టాలనే సాకును చూపి అధికార బలంతో ఈ ఏడాది జూలైలో డీ-పట్టాదా రుడికి నోటీసులు జారీ చేశారు. అప్పటికీ ఆ పట్టాదారుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. మూడు నెలల క్రితం మరో నోటీసిచ్చారు. మీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని అందుకు ప్రభుత్వ పరిహారం ఇస్తా మని ఆ నోటీసులో ఆ పట్టాదారుడికి సూచించారు. నోటీసులివ్వడంతో సరిపెట్టలేదు... ఏకంగా ఆ 71 సెంట్ల భూమిని ఆనలైనలో లేకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టించారు. భూమి హక్కుదారుడు శ్రీనాథ్‌కుమార్‌తో వైసీపీ నేతలు మంతనాలకు దిగారు. భూమి ఇస్తే... ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికార పార్టీ రుబాబునూ చూపారు. ఆ భూమి యజమాని కాళ్లబేరానికి వచ్చేలా చేశారు. దీంతో ఆ పట్టాదారుడు 71 సెంట్ల భూమిని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడే అధికార పార్టీ నేతలు దర్పాన్ని ప్రదర్శించారు. రూ. కోట్లు విలువైన భూమిని అప్పనంగా తక్కువ ధరకు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. రూ. కోటిలోపే ఆ భూమిని కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్‌ రాయించుకున్నట్లు సమాచారం. ప్రధాన రహదారికి పక్కనే కావడంతో సెంటు సగటున రూ. 7 లక్షల దాకా ధర పలుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంటే ఈ లెక్కన 71 సెంట్లకు సుమారు రూ. 5 కోట్ల దాకా రాబడి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదనంగా రూ. 4 కోట్లు కొట్టేసేందుకు వైసీపీ నేతలు ఎత్తుగడ వేశారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. 


వంకపోరంబోకు భూమి ఆక్రమణతో అదనంగా రూ. కోట్లు..

డీ-పట్టాదారుడి భూమితో పాటు వంకపోరంబోకు భూమికి సంబంధించి 30 సెంట్ల దాకా ఆక్రమించుకొని గ్రావెల్‌తో చదును చేయడంతో అదనంగా రూ. కోట్లు దండుకునేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ లెక్కన సెంటు రూ. 7 లక్షలనుకున్నా... రూ. 2 కోట్లకుపై బడి సొమ్ము చేసుకోవచ్చన్నది వారి అంచనాగా కనిపి స్తోంది. ఇదిలా ఉండగా... ప్రభుత్వ నిబంధనల మేరకు... డీ-పట్టా భూమిని ప్లాట్ల రూపంలో లేఔగా ఏర్పాటు చేసేందుకు అనుమతుల్లేవు. అయినప్పటికీ... అధికారంలో ఉన్నామనే ధీమాతో భూమిని గ్రావెల్‌తో చదును చేయ డంతో పాటు అందులో 28 ప్లాట్లు వేస్తున్నట్లు లేఔట్‌ను పేపర్‌ రూపంలో సిద్ధం చేయడం గమనార్హం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా, డీ-పట్టా భూమి కొనుగోలుకు అనుమతులు లేకపోయినా, అధికార పార్టీనే తలు లేఔట్‌ రూపంలో ప్లాట్లు వేసి విక్రయాలు జరిపేం దుకు సిద్ధపడుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.



Updated Date - 2021-12-30T06:47:22+05:30 IST