లంచం డిమాండ్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2021-07-12T06:02:02+05:30 IST

మండలంలోని పోతుకుంట పోలీ్‌సస్టేషనలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్ప ఫోన ద్వారా డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియో సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

లంచం డిమాండ్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌

సోషల్‌ మీడియాలో ఆడియో వైరల్‌

అది లంచం కాదు.. 

అప్పు : హెడ్‌కానిస్టేబుల్‌ 


ధర్మవరం రూరల్‌, జూలై 11: మండలంలోని పోతుకుంట పోలీ్‌సస్టేషనలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్ప ఫోన ద్వారా డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియో సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌  అయింది. ధర్మవరం మండలం వెంకటతిమ్మాపురం గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి కుమారుడు మారుతిరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వారికున్న 3.50 ఎకరాలను అమ్మకానికి పెట్టారు. మొదట వచ్చిన వ్యక్తి ఎకరా రూ. 2 లక్షలకు అడిగాడు. దీంతో బేరం కుదరలేదు.  తమ సమీప బంధువుకు ఆ పొలాన్ని ఎకరా రూ. 3.5 లక్షలతో అమ్మాడు. ఆ సమయంలో హెడ్‌కానిస్టేబుల్‌ పు ల్లప్ప మారుతిరెడ్డికి ఫోన చేసి తాను చెప్పిన వాళ్లకే భూమిని అమ్మాలని, లేకుంటే అప్పుల వాళ్లు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నిలదీసేలా చేస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా తనకు రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మారుతిరెడ్డి ఆ హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.5 వేలు ఫోనపే ద్వారా, రూ.25 వేలు నగదును చేతికి ఇచ్చాడు. ఆ హెడ్‌కానిస్టేబుల్‌ డబ్బులు డిమాండ్‌ చేసిన ఆడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌ అయింది. దీనిపై హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్పను వివరణ కోరగా.. వేణుగోపాల్‌రెడ్డి వద్ద తీసుకున్న అప్పును మారుతిరెడ్డి తిరిగి ఇవ్వలేదన్నారు. దీంతో ఆ ఇరువురి మధ్య గొడవలు లేకుండా సానుకూలంగా డబ్బులు ఇవ్వాలని మారుతిరెడ్డికి సూచించానన్నారు. ఆ డబ్బు విషయమే తనతో ఫోనలో మాట్లాడానని అన్నారు. ఇటీవల మారుతిరెడ్డి తన భార్యను వెలుగు గ్రూపులో చేర్చుకోవాలంటూ అదే గ్రామంలో మహిళలతో గొడవ పడ్డాడన్నాడు. బాధిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అయితే ‘ హెడ్‌కానిస్టేబుల్‌ పుల్లప్ప నాకు బాగా తెలుసు.. మీరు నన్ను ఏమీ చేసుకోలేరు..’ అంటూ  మారుతిరెడ్డి వారిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు తనకు తెల్సిందన్నారు. దీంతో అతన్ని స్టేషనకు పిలుపించుకొని మందలించానని, ఆ కారణంతో తనపై ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తనకు భూముల విషయం తో సంబంధమే లేదన్నారు.

Updated Date - 2021-07-12T06:02:02+05:30 IST