చిత్రావతి బ్రిడ్జి వద్ద కుంగిన రోడ్డు

ABN , First Publish Date - 2021-03-29T05:48:15+05:30 IST

నిత్యం వాహనాలు, జనసంచారంతో రద్దీగా ఉండేప్రాంతంలో పెద్ద గొయ్యిపడి ఆరునెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు

చిత్రావతి బ్రిడ్జి వద్ద కుంగిన రోడ్డు
రోడ్డుపక్కన ఏర్పడిన గొయ్యి


 ఆరునెలలవుతున్నా పట్టించుకోని అధికారులు

 పుట్టపర్తి, మార్చి 28: నిత్యం వాహనాలు, జనసంచారంతో రద్దీగా ఉండేప్రాంతంలో పెద్ద గొయ్యిపడి ఆరునెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. స్థానిక చిత్రావతి బ్రిడ్జి పక్కన వర్షాలకు తారురోడ్డు చిత్రావతిలోకి కుంగిపోయి పెద్ద గొయ్యిలా ఏర్పడింది. ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. నాలుగురోడ్లకూడిలి కావడంతో జనసంచారం సైతం అధికంగా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం అలక్ష్యం చేసినా ప్రమాదంలో పడిపోతారు. పది అడుగులకు పైగా లోతు ఉన్న గొయ్యిని పూడ్చడంలో అ ధికారుల అలసత్వం కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒక పక్కన మున్సిపాలిటీ, మరో పక్క ఇరిగేషన్‌ శాఖలు మా పరిధిలో లేదంటూ పేర్కొంటున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. 


Updated Date - 2021-03-29T05:48:15+05:30 IST