కలెక్టరేట్‌లో కొనసాగిన కొవిడ్‌ ప్రత్యేక సెల్‌

ABN , First Publish Date - 2021-10-31T06:10:12+05:30 IST

కలెక్టరేట్‌ ఆవరణంలోని స్పందన సెంటర్‌లో కొవిడ్‌ ప్రత్యేక సెల్‌ సేవలు రెండో రోజైన శనివారమూ కొనసాగాయి

కలెక్టరేట్‌లో కొనసాగిన కొవిడ్‌ ప్రత్యేక సెల్‌


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 30: కలెక్టరేట్‌ ఆవరణంలోని స్పందన సెంటర్‌లో కొవిడ్‌ ప్రత్యేక సెల్‌ సేవలు రెండో రోజైన శనివారమూ కొనసాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక సెల్‌ అధికారులు, సిబ్బంది దరఖాస్తు ఫారాలు ఇవ్వడంతోపాటు దరఖాస్తు ఫారాన్ని ఎలా పూరించాలి..? ఏఏ సర్టిఫికెట్లు జత చేయాలి..? ఏఏ అధికారులతో సంతకాలు చేయించుకోవాలి..? తదితర వివరాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రత్యేక సెల్‌తోపాటు మండల తహసీల్దార్‌ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ దరఖాస్తులు పొందవచ్చనని డీఆర్‌ఓ గాయత్రీదేవి తెలిపారు. ఆనలైనలోను దరఖాస్తు ఫారాన్ని డౌనలోడ్‌ చేసుకొని, దరఖాస్తులో సూచించిన విధంగా సంబంధిత అధికారులతో సంతకాలు చేయించుకొని, తగిన సర్టిఫికెట్లు జమ చేసి దరఖాస్తును సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారించి కొవిడ్‌తో మరణించిన కుటుంబాలకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామన్నారు.



Updated Date - 2021-10-31T06:10:12+05:30 IST