వ్యాక్సినతోనే కొవిడ్‌ నియంత్రణ

ABN , First Publish Date - 2021-06-21T05:54:33+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ పేర్కొన్నారు.

వ్యాక్సినతోనే కొవిడ్‌ నియంత్రణ
హిందూపురంలో వ్యాక్సినేషనను పరిశీలిస్తున్న చైర్‌పర్సన ఇంద్రజ

హిందూపురం టౌన, జూన 20: కొవిడ్‌ నియంత్రణకు టీకా ఒక్కటే మార్గమని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ పేర్కొన్నారు. ఈ మేరకు హిందూపురం మున్సిపల్‌ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన స్పెషల్‌డ్రైవ్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన కార్యక్రమాలను మున్సిపల్‌ చైర్‌పర్సన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ను నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్నారు. స్వచ్చందంగా ముందుకొచ్చి టీకా కార్యక్రమానికి సహకరించాలన్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించామన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు చెందక టీకాలు వేయించుకోవాలని కోరారు. నిరంతరం ప్రజలు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్‌ వినియోగిస్తూ ఉంటేనే రక్షణ ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

 3600కు గాను 2600 మందికే 

హిందూపురం పట్టణంలో కొవిడ్‌ టీకా వ్యాక్సినేషన స్పెషల్‌ డ్రైవ్‌లో 3600మందికి  వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఆదివారం ఉద యం 1700మందికి మాత్రమే టీకా వచ్చింది. మధ్యాహ్నం మరో 900 మందికి టీకా వేశారు. మొత్తంగా 2600మందికే టీకా వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏమో 3600టీకా అనిచెప్పి 2600 మందికే వేయడంపై కొన్ని చోట్ల టీకాకు వెళ్లినవారు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన జబీవుల్లా, కౌన్సిలర్లు మారుతిరెడ్డి, బలరాంరెడ్డి, మంజుళ, సునీత, షాజియ, రమేష్‌, వ్యాక్సినేషన కార్యక్రమంలో పాల్గొన్నారు. 




Updated Date - 2021-06-21T05:54:33+05:30 IST