కొడాలి నానీ.. నోరు అదుపులో పెట్టుకో..

ABN , First Publish Date - 2021-08-20T06:22:12+05:30 IST

‘నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా రెండేళ్లుగా సహనం ఓర్పుతో చూశాం... ఇక నుంచి కారు కూతలు కూస్తే గుడ్డలూడదీసి తన్నుతాం..’ అని మంత్రి కోడాలి నానిని హిందూపురం పార్లమెంట్‌ తెలుగు యువత నాయకులు ఘాటుగా హెచ్చరించారు

కొడాలి నానీ.. నోరు అదుపులో పెట్టుకో..
తెలుగు యువత కమిటీ అధ్యక్షుడు సిద్దార్థను అభినందిస్తున్న టీడీపీ నాయకులు


తెలుగు యువత హెచ్చరిక

హిందూపురం, ఆగస్టు 19: ‘నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా రెండేళ్లుగా సహనం ఓర్పుతో చూశాం... ఇక నుంచి కారు కూతలు కూస్తే గుడ్డలూడదీసి తన్నుతాం..’ అని మంత్రి కోడాలి నానిని హిందూపురం పార్లమెంట్‌ తెలుగు యువత నాయకులు ఘాటుగా హెచ్చరించారు. గురువారం హిందూపురం నియోజక వర్గం తెలుగు యువత నూతన కమిటీ ఎంపిక నేపథ్యం లో హిందూపురంలో ఎమ్మెల్యే నివాసం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు బాబ్‌జాన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ తుగ్గక్‌ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారన్నారని విమర్శించారు. మంత్రి కోడాలి నాని అధికార మదంలో పరుష పదజాలంతో నోటికొచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకే్‌షలపై అనుచితల వ్యాఖ్యల చేస్తే సహించేలేదని అన్నారు. ఇలాగే మాట్లాడితే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు తెలుగు యువత ఇంకో కోణం చూడాల్సి ఉంటుందని.. తమ తడాఖా ఏంటో చూపిస్తామని మంత్రి కోడాలినాని, వైసీపీ ఎమ్మెల్యే నాగార్జునలను హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రతలు లేకుండా పోయిందని, నిరంకుశ పాలనపై ప్రశ్నిస్తే కక్ష్యసాధింపులు, అరెస్టులు భయపెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల పక్షాన పొరాటంలో తెలుగు యువత ముందుడాలన్నారు. తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత క్రీయాశీలకంగా వ్యవహరించి రాష్ట్రంలో అధికారంతో తీసుకురావడంతో కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, పార్లమెంట్‌ మీడియా కో-ఆర్టినేటర్‌ చంద్రమోహన్‌, తెలుగు రైతు నారాయణరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్లు అశ్వత్థనారాయణ, రంగారెడ్డి, రమేష్‌, టీడీపీ నాయకులు అమర్‌నాథ్‌, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, దుర్గానవీన్‌, రామాంజినేయులు, డైమాండ్‌ బాబా, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు సురేంద్ర యాదవ్‌, భాస్కర్‌, నబీ రసూల్‌, మహిళ నాయకురాల్లు శ్రీదేవి, విజయలక్ష్మీ  పాల్గొన్నారు. 


నూతన కమిటీ : హిందూపురం నియోజక వర్గం తెలుగు యువత నూతన కమిటీని  బాబ్‌జాన్‌ ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడిగా కొండూరు సర్పుంచ్‌ సిద్దార్థ,  ప్రధాన కార్యదర్శిగా మమహ్మద్‌ అమీన్‌, ఉపాధ్యక్షుడిగా రఘనాథరెడ్డి, అధికార ప్రతినిధిగా మంజునాథ్‌, కార్యనిర్వహాక కార్యదర్శిలుగా విశ్వనాథ్‌రెడ్డి, అశోక్‌ దేవేంద్ర, కార్యదర్శులుగా సతీష్‌, సునీల్‌ కుమార్‌, నాగేంద్ర, నూర్‌బాషా, చంద్రకాంత్‌రెడ్డిని ఎంపిక చేశారు. 


Updated Date - 2021-08-20T06:22:12+05:30 IST