48 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదింపు

ABN , First Publish Date - 2021-01-12T06:27:40+05:30 IST

సచివాలయ ఉద్యోగి అనిల్‌బాబు కి డ్నా్‌ప కేసును సోమవారం ఎస్‌ఐ మోహనకుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు 48 గంటల్లో ఛేదించారు.

48 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదింపు
అనిల్‌బాబు (ఫైల్‌)

బంధువులే కిడ్నాపర్లు


పుట్లూరు, జనవరి11 : సచివాలయ ఉద్యోగి అనిల్‌బాబు కి డ్నా్‌ప కేసును సోమవారం ఎస్‌ఐ మోహనకుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడిపత్రి 19 వార్డు సచివాలయ ఎడ్యుకేషన సె క్రటరీగా అనిల్‌బాబు విధులు నిర్వహిస్తున్నాడు. యాడికి మం డలం పుప్పాల గ్రామంలో నివాసం ఉంటూ రోజూ విధుల నిమిత్తం తాడిపత్రికి వస్తుండేవాడు. అక్క భర్త నరసింహ సు మారు రూ.12 లక్షలు అప్పులు చేసి, ఇంటి నుంచి వెళ్లిపోవడం తో తమ్ముని వద్ద ఆమె ఉంటోంది. బావ పరారీలో ఉండటంతో బావమరిది అనిల్‌బాబును తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉన్న సమీప బంధువైన లక్ష్మీనారాయణ అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. భార్య స్వగ్రామమైన కోమటికుంట్లకు వెళ్లి వస్తుండగా అనిల్‌బాబును పుట్లూరు గ్రామ శివారులో ఉన్న పెట్రోల్‌ బంకు వద్ద కారులో లక్ష్మీనారాయణ, మరో ముగ్గురితో కలిసి కిడ్నా్‌ప చేశాడు. అనంతరం లక్ష్మీనారాయణ అత్తగారి ఊరైన కడపజిల్లా లింగాల మండలం లోపలదంతాల గ్రామంలో దాచిపెట్టాడు. మామ శ్రీనివాసులు సాయంతో ఇద్దరు వ్యక్తులను కాపలాగా ఉంచాడు. అనిల్‌బాబు సెల్‌ఫోన స్విచాఫ్‌ వస్తుండడంతో ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో చివరికి పోలీసులకు భార్య ప్రత్యూష ఫిర్యాదు చేసింది.


రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణా ల్లో విచారణ చేపట్టారు. చివరికి అనిల్‌బాబు భార్య తమ్ముడు ఓవేంద్ర పోలీసులకు లక్ష్మీనారాయణ గురించి చెప్పగా పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. లక్ష్మీనారాయణ కాల్‌డేటాను సేకరించారు. కడప జిల్లా లింగాల మండలం శివారులో సెల్‌ఫోన సిగ్నల్‌ చూపించడంతో సోమవారం పోలీసులు అక్కడికి వెళ్లి కిడ్నాపర్ల చెరలో ఉన్న అనిల్‌బాబును అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన లక్ష్మీనారాయణతోపాటు సహకరించిన నారాయణ, శ్రీనివాసులు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పుట్లూరు పోలీ్‌సస్టేషనకు తీసుకువచ్చి, విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-01-12T06:27:40+05:30 IST