బాలిక కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-08-21T06:04:09+05:30 IST

పట్టణంలోని ఓ వీధికి చెం దిన బాలికను కొందరు దుండగులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిడ్నాప్‌ చేశా రు.

బాలిక కిడ్నాప్‌

24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. 

కదిరి, ఆగస్టు 20: పట్టణంలోని ఓ వీధికి చెం దిన బాలికను కొందరు దుండగులు గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిడ్నాప్‌ చేశా రు. బాలిక అక్క ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి, కేసును 24 గంటల్లోనే ఛేదించి, బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. శుక్రవారం పట్టణ పో లీసు స్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్‌ కేసు వివరాలను ఇనచార్జ్‌ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. కదిరి మండలం రాచువారిపల్లితండాకు చెందిన దేవిరెడ్డి సాయినాథ్‌రెడ్డి ఓ వీధిలో ఉన్న బాలిక ఇంటి వద్దకు వచ్చి, ఆమె అక్కతో కాసేపు మాట్లాడాడు. తెలిసిన వ్యక్తి కావడంతో ఆమె మాట్లాడింది. ఇంతలోనే మరో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరపడి బాలికను బల వంతం గా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని, తుర్రుమన్నారు. పట్టణంలోని కోనేరు వద్ద ద్విచక్రవాహనం వదిలి, స్కార్పియో వాహనంలో వారితోపాటు బాలికను బలవంతంగా ఎక్కించారు. అనంతరం గోరంట్ల, పెనుకొండ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లారు. బాలిక కిడ్నాప్‌ అయిన విషయాన్ని ఆమె అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకటబసయ్య మూడు బృందాలుగా ఏర్పడి, కిడ్నాపర్ల కోసం ప లు ప్రాంతాలు గాలించారు. గోరంట్ల, పెనుకొండ, బత్తలపల్లి తదితర ప్రాంతాలను వెతుకుతూ చివరకు ధర్మవరం రైల్వేస్టేషన వద్ద స్కార్పియో వాహనాన్ని గుర్తించి, వెంబడించారు. రెండున్నర కిలోమీటర్లు దూరం వెళ్లిన తర్వాత కిడ్నాపర్లు సీఐ కి లొంగిపోయారు. వారిని అరెస్టు చేసి, కదిరి పో లీసుస్టేషనకు తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరుగు రిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కదిరి మండలం వీరేపల్లిపేటకు చెందిన గాలి ప్రకాశరెడ్డి, ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన అశోక్‌కుమార్‌, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి వాసి బయారెడ్డి అదే మండలం కమ్మవారిపల్లికి చెందిన సోమశేఖర్‌నాయుడు, గోరంట్లలోని చౌడేశ్వరి కాలనీకి చెందిన మనోహర్‌ పట్టుబడ్డార న్నారు. బాలికను పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్‌ చేసినట్లు నిందితులు పోలీసు విచారణలో తెలిపారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రెం డు బైక్‌లు స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజ రుపరచినట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వెంకటబసయ్య, మక్బుల్‌బాషా, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


Updated Date - 2021-08-21T06:04:09+05:30 IST