కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-10-25T06:12:04+05:30 IST
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 21, 22వ తేదీల్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ చాటారు.

ధర్మవరం, అక్టోబరు 24: అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో ఈనెల 21, 22వ తేదీల్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీల్లో ధర్మవరం విద్యార్థులు ప్రతిభ చాటారు. పట్టణానికి చెందిన మల్టీస్టార్ ఆలిండియా బుడోఖాన్ కరాటే అకాడమీ విద్యార్థులు జిల్లాస్థాయిలో పోటీల్లో 17మంది విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచినట్టు కరాటే మాస్టర్ ఇనాయత్బాషా తెలిపారు. అకాడమీ విద్యార్థులు రిషికష్, భానుప్రకాశ్లు రెండు కాంస్యపతకాలు సాధించారన్నారు. దీంతో వీరిని ఆదివారం కొత్తపేట బాలికల ఉన్నతపాఠశాలలో కరాటేమాస్టర్తో పాటు పలువురు అభినందించారు.