భక్తిశ్రద్ధలతో కనకదాస జయంతి

ABN , First Publish Date - 2021-12-26T06:06:47+05:30 IST

మండలంలోని మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురంలో కురబలు శనివారం భక్త కనకదాస జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో కనకదాస జయంతి
కనకదాస జ్యోతుల ఉత్సవంలో పాల్గొన్న పరిటాలసునీత


రామగిరి, డిసెంబరు 25: మండలంలోని మాజీ మంత్రి పరిటాల సునీత  స్వగ్రామం వెంకటాపురంలో కురబలు శనివారం భక్త కనకదాస జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పరిటాలసునీత పాల్గొని, జ్యోతులు మోసుకెళ్తున్న మహిళల వెంట నడిచారు. అనంతరం భక్త కనకదాస చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తకనకదాస మహోన్నతుడని ఆయన సేవాగుణం, భక్తిప్రవచనాలు, ఆదర్శనీయమ న్నారు. ఈ సందర్భంగా కురుబ కులస్థులు మాజీ మంత్రికి కనకదాస చిత్రపటాన్ని అం దించి ఘనంగా సత్కరించారు.  కార్యక్రమంలో టీడీపీ స్థానిక  నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T06:06:47+05:30 IST