పోలీసుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , First Publish Date - 2021-09-03T06:01:51+05:30 IST

ఆంధ్రరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ఖూనీ చేస్తున్నారని, టీడీపీ పొలిట్‌బ్యూ రో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.

పోలీసుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

రాయదుర్గంటౌన, సెప్టెంబరు 2: ఆంధ్రరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ఖూనీ చేస్తున్నారని,  టీడీపీ  పొలిట్‌బ్యూ రో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ చేసే ఉద్యమాలను అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం శతవిధాలా ప్ర యత్నిస్తోందని ఆరోపించారు. గుంటూరులో ప్రేమోన్మాది చేతి లో బలైన రమ్యకు న్యాయం జరగాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యా ప్తంగా తెలుగు మహిళ, తెలుగు యువత ప్రతినిధులు దిశ పోలీస్‌స్టేషనల ఎదుట శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే హౌస్‌ అరెస్టులు, బలవంతంగా పోలీస్‌ స్టేషన్లకు తరలించడం అమానుషమని పేర్కొన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబుపై ఓ పోలీసు అధికారి చేయి చేసుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు.  ప్రభుత్వ అసమర్థత, చేతకానితనాన్ని కప్పి పుచ్చేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్య క్షుడిపై చేయిచేసుకున్న పోలీసు అధికారిని తక్షణం సస్పెం డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-09-03T06:01:51+05:30 IST