ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డాక్టర్లపై దాడులు
ABN , First Publish Date - 2021-12-09T05:49:52+05:30 IST
అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దా డులు జరుగుతూనే ఉన్నాయనీ, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి తమకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న నిర్లక్ష్యమే దీనికి కారణమని వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మండిపడ్డ వైద్యులు... మానవహారం, ర్యాలీలతో నిరసన
అనంతపురం వైద్యం డిసెంబరు 8:
అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట వైద్యులపై దా డులు జరుగుతూనే ఉన్నాయనీ, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి తమకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న నిర్లక్ష్యమే దీనికి కారణమని వైద్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌పై రోగుల బంధువుల దాడిని నిరసిస్తూ బుధవారం కూడా జిల్లా కేంద్రంలో జూనియర్ డా క్టర్లు ఆందోళన చేపట్టారు. ఆస్ప త్రి నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వరకు ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ప్ర భుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో కనీస వసతులు, చికిత్సకు అవసరమైన పరికరాలు సమకూర్చడం లే దన్నారు. చివరకు సెలైన బాటిల్స్ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశా రు. వైద్యులు, సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులు పడుతూ చికిత్సలు అందిస్తున్నా తమపై దాడు లు చేస్తుండడం దారుణమన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలకు అనేకసార్లు తమ సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా దాడులు జరగకుండా చేయాలని, అవసరమైన వ సతులు ఆస్పత్రుల్లో కల్పించాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నిరసనలో జూడా డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, నాయకులు డాక్టర్ రవితేజ, డాక్టర్ శివ, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ హరికృష్ణ, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.