కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-07-08T06:35:39+05:30 IST

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొ త్త జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేయాలని విద్యార్థి, యువజన, నిరుద్యోగ సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి

ముఖ్యమంత్రికి విద్యార్థి, యువజన, 

నిరుద్యోగ సంఘాల నాయకుల బహిరంగ లేఖ


అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై7: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొ త్త జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేయాలని విద్యార్థి, యువజన, నిరుద్యోగ సం ఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ము ఖ్యమంత్రి జగనకు రాసిన బహిరంగలేఖను వారు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్‌, సంతోష్‌ కుమార్‌, ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శులు సూ ర్యచంద్ర, రమేష్‌, ఎనఎ్‌సయూఐ విశ్వవిద్యాలయాల కార్యద ర్శి పులిరాజు, టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకే్‌షలు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్‌తో విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశకు గురయ్యారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాద యాత్రలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఇచ్చిన హామీ ఏమైందని లే ఖలో సీఎంను ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడు తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్త జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరు తూ ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించి అరె్‌స్టలతో ప్రభుత్వం బెదిరి స్తోందని విమర్శించారు.  నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే వెంటనే సీఎం జగన రాజీ నామా చేయాలని డిమాండ్‌ చేశారు. కరవు జిల్లాలో రై తులు పంటలు పండక తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదు ర్కొంటున్నారని, దీంతో తమ పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగనకు బహిరంగ లేఖ రాశామని తెలిపారు. 


Updated Date - 2021-07-08T06:35:39+05:30 IST