ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-07-24T06:21:01+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయ బ ద్దమైన సమస్యలను పరిష్కరించాలని ప్యాప్టో జిల్లాచైర్మన శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

-ధర్నాలో ఫ్యాప్టో జిల్లా చైర్మన శెట్టిపి జయచంద్రారెడ్డి
ధర్మవరం, జూలై 23: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయ బ ద్దమైన సమస్యలను పరిష్కరించాలని ప్యాప్టో జిల్లాచైర్మన శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫ్యాప్టో రాష్ట్ర నా యకుల పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం జయచంద్రారెడ్డి అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ... జూలై 1, 2018 నుండి పీఆర్‌సీ అమలుకు. పెండింగ్‌లో ఉన్న 6డీఏలను మంజురుచేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు పాతపెన్సన విధానాన్ని పునరుద్దరణ చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో ప్రతినెల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని, కరోనాతో మృతిచెందిన ఉద్యోగ కుటుంబాలకు వెంటనే కారుణ్య నియామ కాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో జిల్లానా యకులు బీకేముత్యాలప్ప మాట్లాడుతూ...పీఆర్‌సీ నివేధిక ప్రభుత్వా నికి సమర్పించినప్పటికీ ఇప్పటివరకు వాటిలోని అంశాలను బహిర్గతం చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. నూతన జాతీ య విద్యావిదానంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, 3, 4,5 తరగ తులను ఉన్నతపాఠశాలలకు తరలించరాదని, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ నీలకంఠారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమం లో ఫ్యాప్టో ధర్మవరం నాయకులు రవీంద్రరెడ్డి, రామకృష్ణనాయక్, ల క్ష్మయ్య, హరికృష్ణ, చంద్రశేఖర్‌గౌడ్, ఆదిరెడ్డి, శంకరనారాయణ, లక్ష్మీనారాయణ, రామలింగారెడ్డి, దుర్గాప్రసాద్, నాగభూషణ, వాసు కుమార్, రాంప్రసాద్, బలరాముడు, రామాంజినేయులు, సాయి గణేశ పాల్గొన్నారు.
కదిరి: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో నాయకుల పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన మాట్లాడుతూ జూలై 1 2018 నుండి పీఆర్‌సీ అమలు, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను మంజూరు చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన విధానాన్ని కొన సాగిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలన్నారు. పదోన్న తుల షెడ్యూల్ విడుదల చేయాలని, కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యో గుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు జిల్లా ఫ్యాప్టో నాయకులు తాహెర్‌వలి, త్రిమూర్తి తదితరులు మాట్లాడారు. వీరికి ఆంధ్ర బహుజన రాష్ట్ర అధ్యక్షుడు అంపావతిని గోవిందు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు హరిప్ర సాద్, రామాంజినాయుడు, ఆనంద్, ఏపీటీఎఫ్ 1938 నాయకులు త్రిమూర్తి, శ్రీవాణి, అన్నం జనార్దన, పులగంటి నారాయణ, గౌస్ లాజం, హరిప్రసాద్, బండారు గంగాధర్, డేరంగుల నారాయణ, రాజశేఖర్, శివశంకర్, హెచఎంల అసోసియేషన అధ్యక్షుడు సురేష్, తిరుపాల్, రామచంద్రారెడ్డి, రవీం ద్రారెడ్డి, సురేష్, సుబ్బారెడ్డి, డీ శ్రీనివాసులు, ఎనజీవో నాయకులు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.