దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జేడీఏ

ABN , First Publish Date - 2021-11-23T06:05:14+05:30 IST

మండలంలోని కాళసముద్రంలో భారీ వర్షాలకు దెబ్బ తిన్న వరి పంటలను సోమవారం జేడీఏ చంద్రనాయక్‌ పరిశీలించారు.

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన జేడీఏ

కదిరి, నవంబరు 22: మండలంలోని కాళసముద్రంలో భారీ వర్షాలకు దెబ్బ తిన్న వరి పంటలను సోమవారం జేడీఏ చంద్రనాయక్‌ పరిశీలించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు నేలవాలిన వరిని కట్టుకోవాలన్నారు. అదేవిధంగా వరికి మొలకలు రాకుండా ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేయాల న్నారు.  ఈకార్యక్రమంలో ఏడీఏ సత్యనారాయణ, ఏఓ షాదబ్‌, సర్పంచ్‌ లలిత మ్మ, ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ మధుసూధన్‌రెడ్డి, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

తలుపులలో.. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చేస్తామని జేడీఏ చంద్రనాయక్‌ తెలిపారు. సోమవారం మండలంలోని ఓబులరెడ్డిపల్లి గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను ఏడీఏ సత్యనారాయణ, ఏఓ సుమతితో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులనుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ -పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు దెబ్బతిన్న పొలంలో ఫోటోలు తీసుకొని ఆన్‌లైన్‌ నమోదు చేసుకుంటే పరిహారం చెల్లిస్తామన్నారు. మం డల వ్యాప్తంగా 517 హెక్టార్లలలో వరి, 51 ఎకరాలలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో చెన్నక్రిష్ణారెడ్డి, ఏఈఓ రహంతుల్లా, సర్పంచ్‌ సుమీయా, దివాన్‌వలి, మహేశ్వర్‌రెడ్డి, వీహెచ్‌ఏ చందన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T06:05:14+05:30 IST