పంటకోత ప్రయోగాలను పరిశీలించిన జేడీఏ
ABN , First Publish Date - 2021-10-21T05:40:09+05:30 IST
మండలంలోని చిగిచెర్ల రెవెన్యూ గ్రామపొలం, గరుడంపల్లి వద్ద ఖరీఫ్ వేరుశనగ పంట కోత ప్రయోగాలను వ్యవసాయధికారులతో కలిసి ఏఎస్‌ఓ గోపాల్ నిర్వహించారు.

ధర్మవరంరూరల్, అక్టోబరు20: మండలంలోని చిగిచెర్ల రెవెన్యూ గ్రామపొలం, గరుడంపల్లి వద్ద ఖరీఫ్ వేరుశనగ పంట కోత ప్రయోగాలను వ్యవసాయధికారులతో కలిసి ఏఎస్‌ఓ గోపాల్ నిర్వహించారు. ఈ పంటకోత ప్రయోగాలను జిల్లా జేడీఏ చంద్రనాయక్ హాజరై పరిశీలించారు. మొదట రైతు కాశెప్ప పొలంలో పంటకోత ప్రయోగాలు చేపట్టగా ఎకరాకు 64.15కేజీలు దిగుబడి వచ్చిందన్నారు. అదేవిధంగా చండ్రాయుడు వేరుశనగ పొలంలో పంటకోత ప్రయోగాలు చేయగా 47.62కేజీలు దిగుబడి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా జేడీఏ మాట్లాడుతూ సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపిందన్నారు. వేరుశనగ పంట పరిస్థితిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ చన్నవీరస్వామి, సర్పంచ్ ముత్యాలప్పనాయుడు, వీహెచ్‌ఏ భా ర్గవ్, ఎంపీఈఓలు స్వాతి, గాయిత్రి, అరుణ, వీఆర్‌ఏలు తిక్కయ్య, నారాయణస్వామి రైతులు హజరయ్యారు.