పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2021-05-05T06:13:28+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించడంతో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ నిశాంతకుమార్‌ ఆదేశించారు.

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు ప్రత్యేక చర్యలు

 జేసీ నిశాంతకుమార్‌ 

అనంతపురం వ్యవసాయం, మే 4: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించడంతో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ నిశాంతకుమార్‌ ఆదేశించారు. మంగళవారం హిందూపురం నుంచి ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, ఎల్‌పీజీ జిల్లా కోఆర్డినేటర్లతో వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. బుధవారం నుంచి రెండు వారాలపాటు ప్రతి రోజు మ ధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరుగుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉం చుకొని పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్లను నిరంతరంగా సరఫరా చేసేందుకు చొరవ చూపాలన్నారు. కర్ఫ్యూ సమయంలో కూడా సి లిండర్‌ డెలివరీ బాయ్స్‌ గుర్తింపు కార్డు చూపించి సిలిండర్లను డెలివరీ చేసుకోవచ్చన్నారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ బాట్లింగ్‌ పాయింట్లల్లో పనిచేసే సిబ్బంది షిఫ్ట్‌ల మేరకు విధులకు వెళ్లే సమయంలో గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతిస్తామరన్నారు. డీజిల్‌, పెట్రోల్‌, ఎల్‌పీజీ రవాణాకు ఉపయోగించే వాహనాలను కర్ఫ్యూ సమయంలోను అనుమతించాలని పోలీసులను ఆదేశించామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైౖనా సమస్యలుంటే 08554- 275805 నెంబర్లకు ప్ర తిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య సంప్రదించాలని సూచించారు. వీసీలో డీఎ్‌సఓ రఘురామిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T06:13:28+05:30 IST