ఏ పేద విద్యార్థికీ అన్యాయం చేయకూడదు
ABN , First Publish Date - 2021-11-21T06:01:24+05:30 IST
ఉన్నత విద్యనభ్యసిస్తున్న అర్హత ఉన్న ఏ ఒక్క పేద విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉపకారవేతనాలు, బోధనా ఫీజులు సకాలంలో అందించాలని జేసీ గంగాధర్‌గౌడ్ అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులపై హాస్టల్ విద్యార్థులను అప్రమత్తం చేయాలి
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 20: ఉన్నత విద్యనభ్యసిస్తున్న అర్హత ఉన్న ఏ ఒక్క పేద విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉపకారవేతనాలు, బోధనా ఫీజులు సకాలంలో అందించాలని జేసీ గంగాధర్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆనలైనలో దరఖాస్తు నుంచి విద్యార్థి, తల్లి బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా చూసే బాధ్యత ఆయా సంక్షేమశాఖల అధికారులు, ఆయా కళాశాల యాజమాన్యం, వార్డు, గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లపై ఉందన్నారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధిం చి డిసెంబరు 5వతేదీలోపు ఫ్రెష్, రెన్యువల్ విద్యార్థులు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. భారీ వర్షాలు, కరోనా, సీజనల్ వ్యాధులు నేపథ్యంలో హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అధికారి నిత్యం హాస్టళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్యలపై తమకు ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పంపాలన్నారు. కార్యక్రమంలో సాంఘి కసంక్షేమశాఖ డీడీ విశ్వమోహనరెడ్డి, బీసీ సంక్షేమశాఖ డీడీ యుగంధర్, జిల్లా గిరిజనసంక్షేమశాఖ అధికారి అ న్నాదొర, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మహ్మద్ రఫీ, జిల్లా విభిన్నప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ అబ్దు ల్‌రసూల్, డీబీసీడబ్ల్యూఓ నరసయ్య, ఏబీససీడబ్ల్యూఓలు, ఏఎ్‌సడబ్ల్యూఓలు, ఏటీడబ్ల్యూఓలు, అధికారులు పాల్గొన్నారు.