టీడీపీలోకి జనసేన పార్టీ నాయకుడి చేరిక

ABN , First Publish Date - 2021-10-28T05:48:56+05:30 IST

నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్‌బాషా టీడీపీలోకి చేరారు.

టీడీపీలోకి జనసేన పార్టీ నాయకుడి చేరిక
అరుణ్‌బాషాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభాకరచౌదరి



అనంతపురం వైద్యం, అక్టోబర్‌27: నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్‌బాషా టీడీపీలోకి చేరారు. నగరంలోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో  బుధవారం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి  ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతిగౌడ్‌, నరసింహులు, సుంకన్న, ఎస్‌ఎం బాషా, పావురాల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T05:48:56+05:30 IST