చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరం

ABN , First Publish Date - 2021-05-20T05:58:01+05:30 IST

బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టరిత్యా నేరమని ఎస్‌ఐ వెంకటరమణ హెచ్చరించారు.

చిన్నారులను పనిలో పెట్టుకోవడం నేరం
అగరబత్తి తయారీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడుతున్న సోమందేపల్లి ఎస్‌ఐ వెంకటరమణ

సోమందేపల్లి(పెనుకొండ టౌన), మే 19: బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టరిత్యా నేరమని ఎస్‌ఐ వెంకటరమణ హెచ్చరించారు. బుధవారం ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశాల మేరకు ఆపరేషన ముస్కాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈక్రమంలో పోలీసులు వివిధశాఖల సమన్వయంతో కరోనా జాగ్రత్తలుపాటిస్తూ ఈ ఆపరేషనలో పాల్గొన్నారు. రైల్వేస్టేషన, బస్టాండు, హోటళ్లు, డాబా, ఇటుకభట్టీలు, ఆటో గ్యారేజ్‌లో తదితర ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. కరోనా కట్టడి లో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధిబాలల కోసం ఆపరేషన ముస్కాన, కోవిడ్‌-19 అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీనిద్వా రా తప్పిపోయిన బాల కార్మికులు, అనాధ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామన్నారు. 

అమరాపురం: బాలకార్మికులను పనులలో పెట్టుకుంటే చర్యలు తప్పవని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పూలమార్కెట్‌లో బాలకార్మికులు పూలు అమ్ముతుండగా వారిని గుర్తించి తల్లిదండ్రులను పిలిపించి ఐసీడీఎస్‌, పోలీసు శాఖ ఆశ్వర్యంలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనులలో ఉంచకూడదని వారిని పాఠశాలల్లో చదివించాలన్నారు. పిల్లలను పనులలో పెట్టుకుని ఒత్తిడిలిగిస్తే వారి జీవితం చిన్నాభిన్నమవుతుందన్నారు. వారికి చదువులపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూ చించారు. ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని వాటిని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలని సూ చించారు. ఈకార్యక్రమంలో జమ్దార్‌ మదుసూధన, కానిస్టేబుళ్లు అన్వేష్‌, ప్రభాకర్‌, అంగనవాడీ కార్యకర్తలు పద్మ, జ్యోతి, క ళావతి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-20T05:58:01+05:30 IST